మనదేశంలో క్రికెట్‌కు ఎంతో ఆదరణ ఉంది. సెలవు రోజులు వచ్చాయంటేనే చాలు.. చిన్నా పెద్దా తేడా లేకుండా అందురూ మైదానంలోనే దిగుతారు. ఇండియా క్రికెట్ టీంకు కూడా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ప్రపంచ కప్ మొదలు కొని గల్లీ క్రికెట్ ఎంతో పేరుగాంచింది. అలాంటి క్రికెట్‌లో సాధారణంగా ఇంగ్లిష్ లేదా హిందిలో కామెంట్రీ వినింటాం. ఆయా రాష్ట్రాలో మ్యాచులు జరిగితే అక్కడి ప్రాంతానికి చెందిన భాషాలోనే కామెంట్రీ చెబుతారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసీ వేద విద్యార్థులు ఆడిన క్రికెట్ మ్యాచ్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వారు పసుపు, కుంకుమ రంగుల్లోని భారతీయ కుర్తా, ధోతీ ధరించి అలరించారు.
లగాన్ తలపించేలా..
2001లో విడుదలైన ఆమీర్‌ఖాన్ లగాన్ చిత్రం ఇప్పటికీ ఓ సంచలనమే భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా పల్లెటూరి ధోతీ, కుర్తాలోనే క్రికెట్ గ్రౌండ్‌లో దిగి బ్రిటీష్ టీంని ఓడిస్తారు. ఈ ఆటలో బ్రిటీష్ టీం సభ్యులంతా ఓ ప్రత్యేకమైన యునిఫాంలో ఆడగా ఆమీర్‌ఖాన్ బృందంతో ఎవరి దగ్గరా ఏ దుస్తులు ఉన్నాయే అందులోనే మైదానంలోకి దిగుతారు. ధోతీ, కుర్తా ధరించి మైదానంలోకి దిగి అదరగొట్టారు. ధోతీలు కట్టుకున్న ఎలాంటి తడబాటు లేకుండా సునాసయంగా ఫోర్లు సిక్స్‌లు కొడుతూ అలరించారు. వీరి ఆటను చూస్తుంటే మరోసారి లగాన్ చూసినట్లనిపించింది.
దేశ సంస్కృతి కాపాడాలనే..
అయితే వీరంతా ధోతీ, కుర్తాలో క్రికెట్ ఆడి అలరిస్తే అక్కడ చెప్పే కామెంట్రీ సంస్కృతంలో చెప్పి వావ్ అనిపించారు. ఆట వివరాలు, పరుగులు క్రీడాకారుల ఆటతీరంతా ఏ మాత్రం తడబడకుండా సంస్కృతిలోనే అనర్గలంగా కామెంట్రీ చెప్పాడు. ఇదే అంశాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల మన్‌కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు. భారతీయ క్రీడల్లో ఎక్కువ భాషాల్లో ఎందుకు లేదన్న అంశాలపై క్రీడ మంత్రిత్వ శాఖ ఆలోచించాలని మోదీ పేర్కొన్నారు. భారతీయ సంస్కృతిని కాపాడుకునేందుకు ఈ వస్త్రాధారణలో క్రికెట్ ఆడి, సంస్కృతంలో కామెంట్రీ చెప్పినట్లు అక్కడి విద్యార్థులు పేర్కొన్నారు.