ఓర్ని.. పప్పులో పాము పిల్ల.. ఆసుపత్రి పాలైన ఈసీఐఎల్‌ ఉద్యోగులు

-

హోటళ్లలో ఇచ్చే కర్రీస్‌లో బొద్దింకలు, పురుగులు వచ్చిన ఘటనలు మీరు చూసి ఉంటారు. కానీ ఏకంగా ఇక్కడ పప్పులో పాము పిల్ల వచ్చింది. అబ్బో తలచుకుంటేనే కంపరంగా ఉంది కదా..! నాణ్యత లేని భోజనం సంగతి అటుంచి మరీ ఇలా పాము పిల్లే పప్పులో రావడం ఏంటి.. ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు మన హైదరాబాద్‌లోనే.

హైదరాబాద్‌ పరిధిలోని ఈసీఐఎల్‌లో ఉన్న ఈవీఎంలు తయారు చేసే విభాగంలో ఉద్యోగులకు క్యాంటిన్ ఉంది. అందులో వడ్డించిన పప్పులో పాముపిల్ల కనిపించడంతో క్యాంటిన్‌కి వచ్చిన ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాంటిన్ నిర్వహకుడి నిర్లక్ష్యాన్ని నిలదీశారు. అయితే అంతకు ముందు భోజనం చేసిన ఉద్యోగుల్లో నలుగురు అస్వస్థతకు గురయ్యారు. వాళ్లు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉద్యోగుల క్యాంటిన్‌లో తాజాగా పాముపిల్ల వచ్చినట్లుగానే గతంలో కూడా ఎలుకలు, బొద్దింకలు వచ్చాయని ఉద్యోగులు ఆందోళనకు దిగారు. దీనిపై స్పందించిన అధికారి ఈ విషయం తమ దృష్టికి ఇప్పుడే వచ్చిందని ..క్యాంటిన్ నిర్వాహకుడ్ని విచారిస్తున్నామని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫోటో క్షణాల వ్యవధిలోనే నెట్టింట తెగ వైరల్‌ అయింది.

బయట భోజనం చేయాలంటే డబ్బులు పెట్టినా సుఖం లేదు. అటు రుచి ఉండదు, ఇటు నాణ్యత కూడా ఉండదు. చాలా మంది కూరలు చేసుకోవడానికి టైమ్‌, ఓపిక లేక బయట నుంచి కర్రీస్‌ తెచ్చుకుంటారు. ఇవి రుచి అంతంత మాత్రంగానే ఉంటాయి. అయినా అలానే తింటారు. అందులో ఎలాంటి ఆయిల్ వాడారో, అసలు అవి ఎప్పటివో ఇవేం మీరు పట్టించుకోరు కదా..! మన ఇంట్లో తయారు చేసుకున్నవే చాలా వరకూ కల్తీ ఉత్పత్తులు అవుతున్నాయి. అయినా ఇంట్లో వంట చేసుకోవడం వల్ల నష్టంలో సగం అయినా తగ్గుతుంది. మీరు ఇంకా బయట చేసినవే తింటే పూర్తిగా ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నట్లే అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇలా కూరల్లో బొద్దింకలు, ఎలుక పిల్లలు, పాము పిల్లలు రావడం అంటే నిర్వాహకలు నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో మీరే అర్థం చేసుకోండి.!

Read more RELATED
Recommended to you

Exit mobile version