వైరల్‌ వీడియో : టిక్ టాక్ ని ఊపేస్తున్న బామ్మ గారు…!

603

ఒక వృద్దురాలు… తన 94 వ పుట్టినరోజును తన కుటుంబంతో జరుపుకునే వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. టిక్‌టాక్‌లో షేర్ చేసిన ఈ క్లిప్ వైరల్ అయింది. 94 వ పుట్టినరోజు వేడుకలకు వృద్దురాలి రియాక్షన్ చూసి ఆశ్చర్యపోయారు. 94 ఏళ్ల మహిళకు కుటుంబం పుట్టినరోజు శుభాకాంక్షల పాట పాడటంతో వీడియో మొదలవుతుంది. ఆమె ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ చూస్తూ ఉంటుంది.

కుటుంబం పుట్టినరోజు పాట పాడటం పూర్తయిన తరువాత, వృద్ధురాలు చిరునవ్వు ఇచ్చి, “సరే, చాలా ధన్యవాదాలు, ఇది నా చివరిది అని నేను నమ్ముతున్నాను” అని అన్నారు. వైరల్ వీడియో టిక్‌టాక్‌లో 13 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించింది. దీనిపై పలువురు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ఆమె మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని, ఈ పాట ఆమెకు మళ్ళీ మళ్ళీ వినపడుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

“బామ్మ ఈ పాటను 94 సార్లు విన్నది అని ఒకరు కామెంట్ చేసారు. “నా బామ్మ అదే మాట చెప్పారు ఆమె దానిని 104 కి చేర్చింది” అని ఒకరు కామెంట్ చేసారు. కొంతమంది అయితే ఆమె మనవరాలు మీద కామెంట్స్ చేసారు. “వెనుక అమ్మాయి ముఖం. లోల్,” టిక్ టోక్ యూజర్ ఒకరు కామెంట్ చేయగా “వెనుక ఉన్న అమ్మాయి నిజంగా ఆమె ముక్కుతో నవ్వుతుంది అంటూ కామెంట్ చేసారు. మీరు కూడా బామ్మ గారికి విష్ చేయండి.

@paulinekayyTHE ENDING .. I CANNOT😭♬ original sound – paulinekayy