వైరల్ వీడియో; విమానం నడిపిన కేటిఆర్…!

-

తెలంగాణా ఐటి మరియు పురపాలక శాఖా మంత్రి కేటిఆర్ సోషల్ మీడియాలో ఎంతో హుషారుగా ఉంటారు, మంత్రి అయినా సరే ఆయన ప్రజల్లో కలిసిపోవడం తో పాటుగా కాస్త చలాకీగా ఉంటూ ఉంటారు. సెల్ఫిలు ఇవ్వడం, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం వంటివి చేస్తూ ఉంటారు. తాజాగా ఆయన పైలెట్ గా మారిపోయారు. విమానాన్ని నడిపి సంచలనం సృష్టించారు.

గురువారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఫ్లైట్ సిమ్యులేషన్ టెక్నిక్ సెంటర్ (FSTC)ని ప్రారంభించారు అనంతరం మంత్రి విమానం నడిపారు. ఈ సందర్భంగా తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరు రాష్ట్రాన్ని కూడా అంతే విజయవంతంగా నడపాలి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే… FSTC అనేది దేశంలో DGCA చేత గుర్తింపు పొందిన ప్రధాన విమానయాన శిక్షణా సంస్థగా ఉంది.

అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ సంస్థ పైలట్లకు శిక్షణ ఇస్తుంది. మన దేశంలో ఇంతకు ముందు వరకు గురుగ్రామ్‌‌లో మాత్రమే ఉంది. తాజాగా హైదరాబాద్ లో కూడా FSTC శిక్షణా కేంద్రాన్ని సంస్థ ఏర్పాటు చేసింది. దీనిని కేటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటిఆర్ మాట్లాడుతూ… FSTC తన శిక్షణా సంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం హర్షనీయమన్నారు. FSTC రాకతో శంషాబాద్ పరిసర వాసులకు శిక్షణా సౌకర్యాలు, పరిశ్రమ అభివృద్ధి, యువతకు అవకాశాలు పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news