వేల అడుగుల లోతులో ఊరు..అమెరికా పల్లెటూరు..గాడిదలే వాహనాలట

-

అమెరికా అంటే మనకు గుర్తుకువచ్చేది ఎత్తైన భవనాలు, అందమైన ప్రదేశాలు. సాంకేతిక పరిజ్ఞానంతో దూసుకోపోయే మనుషులు. చాలామంది లైఫ్ డ్రీమ్ గా ఉంటుంది. అమెరికా వెళ్లాలని, లేదా అమెరికాలో సెటిల్ అవ్వాలని..ఇండియా నుంచి ఎవరైనా అమెరికా వెళ్లారంటే ఇక వాళ్ల లైఫ్ మారినట్లే అని చెబుతుంటారు. వాళ్ల అనుకున్నట్లుగానే చాలామంది అమెరికా వెళ్లి ఇండియాలో చక్రం తిప్పిన వారు ఉన్నారు. మన దగ్గరలాగా గిరిజిన తండాలు, వెనుకబడిన ప్రాంతాలు అమెరికాలో కూడా ఉంటాయా అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా.? అవును ఉందట..అసలు అభివృద్ధి అంటే ఏంటో కూడా తెలియని ఓ గ్రామం అమెరికాలో ఉంది. అసలు నమ్మశక్యంగా లేదు కదా..ఈ కథనం మొత్తం చదివేద్దాం అప్పుడు ఏంటో ఈ గ్రామం, ఇలా ఎందుకు ఉందో తెలుసుకోవచ్చు.

3 వేల అడుగుల లోతులో ఆ గ్రామం..

గ్రాండ్‌ కాన్యన్ అనే లోతైన లోయ అమెరికాలో చాలా ప్రసిద్ధిగాంచిన లోయ. ప్రతీ సంవత్సరం దాదాపుగా 55 లక్షల మంది ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు కూడా. దీనికి సమీపంలోనే సుపాయ్ అనే గ్రామం ఉంది. అతిలోతైన భూగర్భ గ్రామంగా ఎందుకంటే అమెరికా భూమట్టానికి దాదాపుగా మూడు వేల అడుగుల లోతులో ఈ గ్రామం ఉంది. దాదాపు 208 మంది అమెరికన్ స్థానికులు అక్కడ నివసిస్తున్నారు.

గాడిదలే వారి వాహనాలు

ఈ గ్రామస్తులు ఎంత వెనుకబడి ఉన్నారంటే…ఇక్కడి ప్రజలు పూర్తిగా విభిన్న ప్రపంచంలో నివసిస్తున్నారు. వీరికి ప్రత్యేక ఆచార వ్యవహారాలు ఉన్నాయట. సుపాయ్ గ్రామస్థులు హవాసుపాయి భాషను మాట్లాడుతారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వాటిని అనుసరిస్తారట. ఈ గ్రామంలో ప్రయాణించడానికి రైలు లేదు. కనీసం సరైన రోడ్డు కూడా లేదట. ఈ గ్రామానికి చేరుకోవాలంటే కాలి కాలినడకన వెళ్లాల్సిందే..లేదంటే గాడిదలపై రావాలి. అంతేకాకుండా 1, 2 గుర్రాలు కూడా ప్రయాణాలకు వినియోగిస్తున్నారు.. వీటి ద్వారానే సమీపంలో ఉన్న హైవేకి వెళ్తుంటారు. ఈ గ్రామానికి, సిటీని కలిపే ఖచ్చితమైన మార్గం అంటూ ఏదీ లేదు. కేవలం గుర్రాలు, గాడిదలపైనే సిటీలకు ప్రయాణిస్తుంటారు అక్కడి స్థానికులు.

వెదురు బుట్టలే వారి జీవనోపాధి..

ఇక్కడ కొన్ని పోస్టాఫీసులు, కేఫ్‌లు, రెండు చర్చిలు, లాడ్జీలు, ప్రాథమిక పాఠశాలలు, కిరాణా దుకాణాలు అయితే ఉన్నాయి. ఇక్కడి ప్రజల జీవనోపాధి ఏంటంటే.. వెదురుతో బుట్టలను అల్లి సమీపంలోని నగరాల్లో అమ్ముకుని జీవనం సాగించటం. చిక్కుడు, మొక్కజొన్నలను సాగు చేసి పొట్టనింపుకుంటారట.

ఫోన్‌ అంటే ఏమిటో కూడా వీళ్లకు తెలియదు!

రోడ్లే లెవ్వంటే..ఇక ఫోన్లు, ఇంటర్నెట్ గురించి మాత్రం ఏం తెలుస్తుంది వాళ్లకు. ఉత్తరాలతోనే ఏమైనా..కనీసం ఈ ఉత్తరాలు కూడా సమయానికి చేరవట. సరైన సదుపాయాలు లేకపోవటం వల్లే ఈ పరిస్థితి.

ఇదంతా చదువుతుంటే.. ఒకప్పుడు మన పూర్వీకులు బతికిన రోజులు గుర్తుకు వస్తున్నాయ్ కదా. వాళ్లు కూడా అంతే కదా..మనం పాతసినిమాలు, పుస్తకాల ద్వారా వారి జీవనశైలి గురించి తెలుసుకున్నాం. నిజానికి ఇలా ఉండటం బానే ఉన్నా..ఇంకొన్ని సౌకర్యాలు ఉంటే వారికి చాలా ఉపయోగపడేవి. నేటికీ సుపాయి గ్రామం పరిస్థితికి అద్దంపట్టే వాస్తవాలివి. అసలు అమెరికా లాంటి దేశంలో ఇంత వెనుకబడిన గ్రామం ఉందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ.! అంతేకాదు ఈ ఊరుకి వెళ్లాలంటే దారంతా పొదలతో నిండిన అడవులను దాటుకుంటూ వెళ్లాలట.

గ్రామంలోకి వెళ్లాలంటే పర్మిషన్ తీసుకోవాల్సిందే..

ప్రతీ ఏట వేలాది మంది పర్యాటకులు ఈ గ్రామాన్ని చూసేందుకు వెళుతుంటారు. ఈ గ్రామంలోకి ప్రవేశించేముందు హవాసుపాయి గిరిజన మండలి అనుమతి తప్పక తీసుకోవాలట. లేదంటే లోపలికి ప్రవేశం లేదు. గ్రామంలో ప్రవేశించిన తర్వాత కూడా వారి నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందేనట.

అసలు ప్రభుత్వం ఈ గ్రామం పై ఎందకు దృష్టిపెట్టలేదో తెలియదు. వారికి ఏం కారణాలు ఉన్నాయి అనేది బయటకు రాలేదు. ప్రపంచంతో సంబంధం లేకుండా ఈ గ్రామస్తులైతే జీవిస్తున్నారు.

– Triveni BUskarowthu

Read more RELATED
Recommended to you

Latest news