షాకింగ్; బిర్యానినే ఆ గుడిలో ప్రసాదం, ఎక్కడ…?

-

గుడిలో ప్రసాదం అంటే ఎం పెడతారు…? కొబ్బరి ముక్కో, పొంగలో, లడ్డునో, పులిహోరో, ఏదైనా తీపి ప్రదార్ధమో పెడతారు. అసలు నీసు పదార్ధం అనేది గుడిలో ఎక్కడ చూసినా ఉండదు. దానిని దగ్గరకు కూడా ప్రసాదం వద్దకు రానివ్వరు. మొక్కులు చెల్లించుకునే వారు అయినా సరే జాగ్రత్తగా ఉంటారు. అలాంటిది ప్రసాదంగా బిర్యాని పెట్టడం ఎక్కడైనా చూసారా…? అవును తమిళనాడులో బిర్యాని పెడతారు.

తమిళనాడులోని మదురైలో ఉన్న మునియాండి స్వామి దేవాలయంలో ఇక్కడ ప్రసాదాలుగా చికెన్‌బిర్యానీ, మటన్‌ బిర్యానీ భక్తులకు పెడుతూ ఉంటారు. ప్రతి ఏటా జనవరి 24 నుంచి 26 వరకు జరిగే వార్షిక ఉత్సవాల్లో భాగంగా గుడికి వచ్చిన భక్తులకు బిర్యానీ పెడతారు దేవాలయ నిర్వాహకులు. దీని కోసం ఈ ఏడాది వెయ్యి కేజీల బియ్యం, 150 మేకలు, 300 కోళ్లను ఉపయోగించారట.

ఆలయానికి విచ్చేసే భక్తులు అందరికి కూడా ఏమాత్రం వివక్ష చూపకుండా ఈ బిర్యానీ ప్రసాదాన్ని అందజేయడం దేవాలయానికి ఉన్న ప్రత్యేకత. అంతే కాదు మాస్టారూ, బిర్యానీని ఇంటికి పార్శల్‌ తీసుకెళ్లే సదుపాయం కూడా ఈ దేవాలయం కల్పించింది. మరో వింత ఏంటీ అంటే ఈ బిర్యాని ప్రసాదం కోసం అక్కడికి వచ్చే భక్తులు పెద్ద ఎత్తున విరాళాలు సైతం అందజేస్తుంటారు. బిర్యానీని ప్రసాదంగా పంచే సంప్రదాయం 84 ఏళ్లుగా కొనసాగడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news