ప్యాలెస్ లోపల చుక్కలు చూపించిన చిరుతపులి…!

-

రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లోని ఒక సిటి ప్యాలెస్ లో చిరుతపులి చుక్కలు చూపించింది. దీనితో పర్యాటకులు, ప్రజలు అందరూ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వివరాల్లోకి వెళితే వైల్డ్‌లైఫ్‌లోని సిసిఎఫ్ రాజ్‌కుమార్ సింగ్ చెప్పిన వివరాల ఆధారంగా చూస్తే, ఆదివారం రాత్రి ఒక చిరుతపులి ప్యాలెస్‌లోకి ప్రవేశించి ఒక గ్యాలరీ లోపలికి వెళ్ళింది. ఒక భద్రతా అధికారి దాని నీడ చూసి అది బయటకు రాకుండా తలుపు మూసేసాడు.

అటవీ అధికారులను వెంటనే పిలిపించి ఆదివారం రాత్రి వారు ప్యాలెస్ లోపల క్యాంప్ చేశారు. ఇంతలో, పర్యాటకులను ప్యాలెస్‌లోకి రాకుండా నిలిపివేసినట్లు అధికారులు నిర్ధారించారు. దాని ఏదోక విధంగా శాంతింప చేసేందుకు గాను అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు చేసారు. అయితే అది వారికి దూరంగా ఉంది. అటవీ అధికారులు క్రిస్టల్ గ్యాలరీ దగ్గర ఒక బోనును ఉంచారు.

అందులో దానికి ఒక ఎరగా మేకను ఉంచారు. చివరకు అది ఏదోక విధంగా పట్టుబడింది. ఒక ట్విట్టర్ యూజర్ దానికి సంబంధించిన ఫోటోలు కూడా పోస్ట్ చేసాడు. ఉదయపూర్ లో 22 గంటల తర్వాత చిరుతపులి ప్రశాంతంగా ఉందని, ఆదివారం రాత్రి అది అందులోకి వెళ్లిందని పేర్కొన్నాడు. అయితే ఆ చిరుతకు కొన్ని గాయాలు కూడా అయినట్టు సమాచారం. దీనితో చికిత్స చేసి అడవిలో వదిలిపెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news