గంట వ్యవధిలోనే ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ

-

బిడ్డకు జన్మనివ్వడం అంటే ఆ తల్లి మళ్లీ జన్మించినట్లే..! కొన్నిసార్లు గర్భిణులు కవలలకు జన్మనిస్తారు. అదే చాలా గొప్ప విషయం.. కానీ ఓ మహిళ గంటలో ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది. పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళ గంట వ్యవధిలోనే ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చి గొప్ప తల్లి అయింది. జీనత్ వాహిద్ అనే 27 ఏళ్ల మహిళ 6 మంది పిల్లలకు జన్మనిచ్చింది. అందులో 4 మంది అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఏప్రిల్ 19న మహ్మద్ వాహిద్ భార్య జీనత్ వాహిద్ గంట వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరుగా ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది. రావల్పిండిలోని ఓ ఆసుపత్రిలో ఈ ప్రత్యేక ఘటన చోటుచేసుకుంది.

రావల్పిండిలోని హజీరా కాలనీకి చెందిన జీనత్ ఏప్రిల్ 18న ప్రసవ నొప్పి రావడంతో రావల్పిండి జిల్లా ఆసుపత్రిలో చేరారు. తల్లి, ఆరుగురు పిల్లలు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని అందరూ 2 పౌండ్ల కంటే తక్కువ బరువుతో ఉన్నారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. పిల్లలను ఇంక్యుబేటర్‌లో ఉంచారు. పిల్లల ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదు. జీనత్‌కి ఇది మొదటి ప్రసవం అని, ఆసుపత్రి వైద్యులు ఆమెకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు కల్పించారని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. అయితే ఇది సహజ ప్రసవం కాదని, ప్రసవ సమయంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆస్పత్రిలోని ప్రత్యేక వైద్యులు సిజేరియన్ ద్వారా శిశువులను బయటకు తీశారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

ప్రసవం తర్వాత తల్లి జీనత్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అయితే తర్వాత ఆమె కోలుకుంది. తమ ఆస్పత్రిలో ఈ అరుదైన ఘటన జరగడంపై ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చిన ఆస్పత్రి సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జీనత్ మరియు వహీద్ కుటుంబం కూడా ఆరుగురు పిల్లలను కలిసి స్వాగతం పలికింది. ఇప్పుడు ఈ విషయం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.. ఒకేసారి ఆరుగురు పిల్లలకు జన్మనివ్వడం అంటే చిన్న విషయం కాదు కదా..!

Read more RELATED
Recommended to you

Latest news