హరీష్ రావు, నీతోని ఆగస్ట్15న మాట్లాడుతా… రాజీనామా పత్రం జేబులో పెట్టుకో : సీఎం రేవంత్ రెడ్డి

-

భూమి బద్దలైనా ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ మరోసారి స్పష్టం చేశారు.బుధవారం వరంగల్ జిల్లా మడికొండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.2లక్షల రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్న హరీశ్రావు తన రాజీనామా లేఖను జేబులో రెడీగా పెట్టుకోవాలని తెలిపారు. రామప్ప, సమ్మక్క సాక్షిగా తాము ఇచ్చిన మాట తప్పబోమని పేర్కొన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని కేసీఆర్ మోసం చేశారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.బీఆర్ఎస్ నేతల్లా తాను తలకాయ లేని మాటలు చెప్పను అని సీఎం అన్నారు.

కాగా, సంగారెడ్డిలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోగా రుణమాఫీ, ఆరు గ్యారంటీలు అమలు చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అన్నారు. మళ్లీ తాను ఎన్నికల్లో పోటీ చేయను అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news