గాడిద పాట పాడటం ఎప్పుడైనా చూశారా? ఇప్పుడు చూడండి.. వైరల్ వీడియో

ఎట్టెట్టా.. గాడిద పాట పాడటం ఏంది? మీకేమైనా మతిపోయిందా? అని అంటారా? మాకు మతి పోలేదు.. గితి పోలేదు.. గాడిద పాట పాడింది నిజం. ఈ ఘటన పూణెలో చోటు చేసుకున్నది. ఈ వీడియో గత సంవత్సరందే అయినా ప్రస్తుతం ఇది సోషల్ మీడియా సెన్సేషన్ అయింది.

పూణెలోని యానిమల్ షెల్టర్ కు చెందిన ఎమిలీ అనే గాడిద… సరదాగా గొంతెత్తింది. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఐర్లాండ్ లో కూడా హారియట్ అనే ఓ గాడిద పాట పాడి సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. సేమ్ అలాగే ఈ గాడిద కూడా పాట పాడి అందరి దృష్టిని ఆకర్షించింది.