షాకింగ్; వేప చెట్టు కల్లు తాగితే సమస్యలు దూరమవుతాయా…?

-

కలియుగంలో ఎన్నో వింతలు చూస్తున్నాం మనం. ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అనేక వింతలు ఈ మధ్య చూస్తున్నాం. వినాయకుడు పాలు తాగుతున్నాడని, సాయిబాబా విగ్రహం నుంచి పాలు కారుతున్నాయని ఏవేవో వింటూ ఉన్నాం. తాజాగా మరో వింత చోటు చేసుకుంది. సాధారణంగా కల్లు దేని నుంచి వస్తుంది. ఈత చెట్టుకో.. తాటి చెట్టుకో కల్లు వస్తుంది.

కాని వింతగా వేప చెట్టుకి కళ్ళు కారడం అనేది ఎప్పుడైనా విన్నారా…? ఎక్కడైనా చూసారా…? కాని కల్లు వేప చెట్టుకి కారుతుంది. అది కూడా కల్లు ధారలు ధారలుగా కారుతుంది. తెలంగాణా రాష్ట్రంలోని మెదక్ జిల్లాలోని అల్లాదుర్గం మండలంలోని చేవెళ్ల గ్రామంలో ఒక వేప చెట్టుకి రంధ్రం పడింది. దీనితో దాన్ని చూసేందుకు గాను జనం తండోప తండాలుగా వచ్చి చూస్తున్నారు.

మూడు రోజులుగా కల్లు ఆ చెట్టు నుంచి ధారలా కారుతోంది. అదే వింతగా ఉంటే వేప కల్లు ఆరోగ్యానికి మంచిదనీ.. అనేక రోగాలు నయమవుతాయని, కళ్ల సమస్యలు పరిష్కారమవుతాయని చెప్తూ ఆ వేప చెట్టు నుంచి కారుతున్న కల్లుని సీసాల్లో పట్టుకుని వెళ్తున్నారు. ప్రస్తుత౦ ఈ వార్త పత్రికల్లో కూడా హైలెట్ అవుతుంది. ఈ వింతను తాము ఎప్పుడూ చూడలేదని కనీసం వినలేదని అక్కడి గ్రామస్తులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news