తాచుపామును చేత్తో ప‌ట్టుకుని ఆడిస్తున్న యువ‌తి.. వైర‌ల్ వీడియో..!

-

పాముల‌ను చూస్తే స‌హ‌జంగానే ఎవ‌రికైనా స‌రే విప‌రీత‌మైన భ‌యం క‌లుగుతుంది. కొంద‌రికైతే వాటి పేరు చెబితేనే ఒళ్లు జ‌ల‌ద‌రించిన‌ట్లు అవుతుంది. ఇక కొంద‌రైతే వాటిని చూస్తే ఎగిరి గంతేసి దూరంగా పారిపోతారు. ముఖ్యంగా స్త్రీల‌కు పాములు అంటే ఎక్కువ‌గా భ‌యం ఉంటుంది. అయితే ఆ యువ‌తి మాత్రం పాములు అంటే అస్స‌లు భ‌య‌ప‌డ‌దు. పైగా వాటిని చేతుల్తో ప‌ట్టుకుని ఆడిస్తుంది.

shweta playing with cobra viral video

శ్వేత అనే ఓ యువ‌తి తాచు పామును చేతిలో ప‌ట్టుకుని క‌ర్ర‌తో దాన్ని ఆడించింది. ఆ వీడియోను ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్ కాతాలో పోస్ట్ చేసింది. ఎలాంటి భ‌యం లేకుండా ఆమె తాచు పామును చేతిలో ప‌ట్టుకుని ఆడిస్తుండ‌డం విశేషం. ఈ క్ర‌మంలోనే ఆమె వీడియోను చూసిన నెటిజ‌న్లు షాక‌వుతున్నారు. సాధార‌ణంగా యువ‌తులు పాములు అంటే భ‌య‌ప‌డ‌తారు. కానీ ఎలాంటి జంకు లేకుండా ఆమె పామును ఆడిస్తుండ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

శ్వేతకు పాములు అంటే ఇష్టం. ఆ విష‌యాన్ని ఆమే స్వ‌యంగా వెల్ల‌డించింది. ఎప్పుడూ పాముల‌తో ఇలా సాహ‌సాలు చేస్తుంటుంది. సాధార‌ణంగా పురుషులే ఎక్కువ‌గా ఇలాంటి సాహ‌సాలు చేస్తారు. స్త్రీలు చేసేందుకు వెనుక‌డుగు వేస్తారు. కానీ ప్ర‌స్తుతం అన్ని రంగాల్లోనూ స్త్రీలు పురుషుల క‌న్నా ఎక్కువ‌గానే రాణిస్తున్నారు. అందుక‌నే ఆమె కూడా ఈ విధంగా సాహ‌సాలు చేస్తోంది. ఆమె ధైర్యాన్ని అభినందించాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news