విద్యార్థుల కోసం వండిన కిచిడీలో పాము..

-

స్కూల్ విద్యార్థుల కోసం వండే వంటలను ఎంతో పరిశుభ్రంగా వండాలి. ఏమాత్రం తేడా వచ్చినా.. విద్యార్థులందరికీ లేనిపోని సమస్యలు వస్తాయి. విద్యార్థుల కోసం వండిన వంటల్లో ఏదేదో కలవడం వల్ల చాలా సార్లు విద్యార్థులు జబ్బుపడ్డ సందర్భాలను అనేకం చూశాం. కానీ.. ఇది చూడండి. విద్యార్థుల కోసం వండిన కిచిడీలో ఏకంగా పాము దర్శనమిచ్చింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాందేడ్‌కు సమీపంలో ఉన్న గర్గవాన్ జిల్లా పరిషత్ ప్రైమరీ స్కూల్‌లో జరిగింది. అక్కడ ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదివే పిల్లలు 80 మంది ఉన్నారు. వాళ్ల కోసం మధ్యాహ్న భోజనంగా వండిన కిచిడీలోనే పాము వెలుగు చూసింది.

కిచిడీ వండగానే పిల్లలకు వడ్డించడం ప్రారంభించారు. ఇంతలో కిచిడీ గిన్నెలో పాము కనిపించింది. దీంతో పిల్లలను ఆ కిచిడీ తినొద్దని తెలిపారు. ఈ ఘటనపై డీఈవో ప్రశాంత్ డిగ్రాస్కర్ స్పందిస్తూ.. దీనిపై విచారణకు ఆదేశించామన్నారు. కిచిడీ తయారు చేయడానికి లోకల్ గ్రూప్స్‌కు ఇచ్చిన కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

కిచిని మహారాష్ట్రలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో రోజూ మధ్యాహ్నం విద్యార్థులకు వడ్డిస్తారు. పౌష్టికాహార లోపం లేకుండా.. పిల్లల్ని స్కూళ్లకు రావడానికి ప్రోత్సహించడం కోసం 1996లో దీన్ని ప్రవేశపెట్టారు. రోజూ దాదాపు 1.25 కోట్ల విద్యార్థులు ఈ కిచిడీని ప్రభుత్వ స్కూళ్లలో తింటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version