ఈ కుక్క చాలా స్మార్ట్ గురూ…!

-

సాధారణంగా కుక్కలు ఆడుకునే ఆటలు మనను ఎంతో ఆకట్టుకుంటూ ఉంటాయి. ఏదైనా చిన్న వస్తువు కనపడితే చాలు అవి ఎంతో హుషారుగా ఆడుకుంటూ ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇంట్లో అయినా బయట అయినా సరే కుక్కలు ఆడే ఆటలకు మనుషులు కూడా ఫిదా అవుతూ ఉంటారు. చిన్న వస్తువు దొరికితే వాటికి ఒకరకంగా పండగ అనే చెప్పుకోవచ్చు. ఇక వీధి కుక్కలు అయితే చెప్పే పని లేదు.

తాజాగా ఒక కుక్క ఆడుతున్న ఆట చూస్తే మీరు కచ్చితంగా ఫిదా అయిపోతారు. అవును ఎముకలు కోరికే చలిలో కుక్క ఆడే ఆట ఇప్పుడు ఆశ్చర్యపరుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. @Akkitwts అనే ట్విట్టర్ యూజర్ ఫిబ్రవరి 2 న “మీరు ఈ రోజు చూసే గొప్పదనం” అనే శీర్షికతో ఒక క్లిప్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

వీడియోలో, భారీగా మంచు భారీగా ప్రాంతాన్ని మీరు చూడవచ్చు. ఒక కుక్క దాని నోటిలో ప్లాస్టిక్ బోర్డుతో వాలు ప్రాంతం నుంచి ఎగువ ప్రాంతం చివరి వైపు పరిగెత్తి చివర వైపు చేరుకున్న తరువాత, తెలివైన కుక్క మంచుతో కూడిన ఉపరితలంపై ఆ బోర్డును ఉంచి, దానిపై కూర్చుని కిందకి జారుతూ ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news