జనసేన పార్టీ లో కీలక నేతగా మొన్నటి వరకు రాణించిన మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. మాట మీద నిలబడలేని పవన్ కళ్యాణ్ వల్ల రాజీనామా చేస్తున్నట్లు గతంలో ఆయన పూర్తిగా రాజకీయాల్లోనే ఉంటానని మాట ఇచ్చి మళ్లీ ఇప్పుడు సినిమాలు చేయడం ద్వారా ఆయన మాట మీద నిలబడే వ్యక్తి కాదని దానివల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లక్ష్మీనారాయణ చెప్పటం జరిగింది.
అయితే లక్ష్మీనారాయణ రాజీనామా వెనుక పవన్ కళ్యాణ్ సినిమాలు కాదని ఒక సరికొత్త వార్త ఇప్పుడు ఏపీ రాజకీయాలలో వినబడుతుంది. మేటర్ లోకి వెళితే గతంలో జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో ఉన్న టైం లో విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేయడం జరిగింది. దీంతో జనసేన పోటీ తో విశాఖ లో ఉన్న బిజెపి పార్టీ నాలుగో స్థానంలో పడిపోయినట్టు…ఇటువంటి నేపథ్యంలో జనసేన పార్టీలో విశాఖ ఇన్చార్జిగా ఉన్న జేడీ లక్ష్మీనారాయణ పొమ్మనలేక పొగ పెట్టినట్లు పవన్ వ్యవహరించడంతో జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా చేసినట్లు సమాచారం.
ఆయన రాజీనామా చేయడం వల్ల విశాఖలో బిజెపి పార్టీ బలపడే అవకాశం ఉందని రాబోయే ఎన్నికల్లో పురందేశ్వరి ఈ ప్రాంతం నుండి పార్లమెంట్ కు పోటీ చేయనున్నట్లు సమాచారం. ఈ వార్త సోషల్ మీడియాలో ఏపీ మీడియాలో రావడంతో జనసేన పార్టీ కార్యకర్త లక్ష్మీనారాయణ రాజీనామా వెనుక ఇంత పెద్ద కుట్ర ఉందా..? అని ఆశ్చర్యపోతున్నారాట.