ఈ చిలుకను చూశారా…? ఈ చిలుకని పట్టిస్తే రూ.10,000…!

-

Aligarh జిల్లాలో ఒక అడ్వర్టైజ్మెంట్ ని ఇచ్చారు. చిలుక తప్పిపోయింది చూసారా..? పట్టించిన వాళ్ళకి ఐదు నుంచి పది వేలు రూపాయలు అని ఒక ప్రకటనని చిలుక యజమానులు ఇవ్వడం జరిగింది. అయితే తప్పిపోయిన ఆ చిలుక ఫారెన్ బ్రీడ్ ది. చిలక తాలూకా ఓనర్ పాంప్లెట్లు కూడా ప్రింట్ చేశాడు. వాటిని అనేక ప్రాంతాల్లో పంచి పెట్టారు. అయితే చిలుకని పట్టిస్తే డబ్బులు ఇస్తామని అనౌన్స్ కూడా చేశారు.

అయితే దురదృష్టవశాత్తు ఎటువంటి సమాచారం ఇంకా రాలేదు. చిలక తప్పిపోయి నాలుగు రోజులైనా కూడా సమాచారం అందలేదు. ALigarh, Quarsi పోలీస్ స్టేషన్ ఏరియా దగ్గర అది తప్పిపోయింది. చిలుక యజమాని ప్రజల వద్దకు వెళ్లి తప్పిపోయిన చిలుక ఆచూకీ తెలిస్తే చెప్పమని అడుగుతున్నారు.

జపాన్ హౌస్ నివాసి ఎస్ సి varshaney ఒక డాక్టర్. తను ఒక హాస్పటల్లో వర్క్ చేస్తున్నారు. అతని కుమార్తె సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆమె మావయ్య కి జంతువులు, పక్షులు అంటే ఇష్టం. అందుకే ఆమె ఆఫ్రికన్ బ్రీడ్ చిలుకని ఒక సంవత్సరంన్నర క్రితం బెంగుళూరు లో ఉన్నప్పుడు కొనుగోలు చేసింది తన భర్త తో పాటు ఆమె లండన్ వెళ్ళి పోయింది.

అప్పటి నుంచి అత్తమామల వద్ద ఆ పక్షి ఉండిపోయింది. మార్చి 3న సౌమ్య తండ్రి మరియు ఆమె మావయ్య సరోజ పోలీస్ స్టేషన్ కి వెళ్లి చిలక తప్పి పోయింది అని చెప్పారు. అది ఆఫ్రికన్ బ్రీడ్ చిలుక అని గ్రే కలర్ లో ఉంటుందని, దాని తోక రెడ్ కలర్ లో ఉంటుంది అని చెప్పారు. పైగా అది మనిషిలాగ కూడా మాట్లాడగలదు. దాని పేరు విస్కీ అని చెప్పారు.

మీడియా తో సరోజ్ మార్చి 2న ఆ చిలుక ఎనిమిది గంటలకి తప్పిపోయిందని, అయితే అది రమేష్ విహార్, మానసరోవర్ మరియు జ్ఞాన సరోవర్ కాలనీ లో ఉండొచ్చని అన్నారు. ఇప్పటికే నాలుగు వందల పాంప్లెట్లు పంచారు. దానిలో 5 వేల నుంచి పదివేల వరకు పట్టించిన వాళ్ళకి ఇస్తామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version