విలన్ గా ఆరెక్స్ హీరో.. నాచురల్ స్టార్ తో ఢీ..!

-

ఆరెక్స్ 100 సినిమాతో యువతని మెప్పించిన కార్తికేయ ఒక్క సినిమాతో రావాల్సిన క్రేజ్ అంతా రాబట్టాడు. పాయల్ తో కార్తికేయ రొమాన్స్ సినిమాకే హైలెట్ అని చెప్పొచ్చు. అంతకుముందు ఓ సినిమా చేసినా కార్తికేయకు పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ఆరెక్స్ 100 మాత్రం అదరగొట్టింది. కమర్షియల్ గా కూడా సినిమాకు భారీ కలక్షన్స్ వచ్చాయ్. ఇదిలాఉంటే కార్తికేయ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా చేస్తున్నాడు. కళైపులి ఎస్ థాను నిర్మాతగా వస్తున్న ఈ సినిమా కూడా బైలింగ్వల్ గా భారీ స్కేల్ లోనే వస్తుంది.

ఇదికాకుండా కార్తికేయకు ఓ నెగటివ్ రోల్ ఆఫర్ కూడా వచ్చిందట. నాచురల్ స్టార్ నాని హీరోగా విక్రం కుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమాలో కార్తికేయ విలన్ గా నటిస్తాడని అంటున్నారు. సినిమాలో స్టైలిష్ విలన్ కావాల్సి ఉండగా ఆ ఆఫర్ కార్తికేయకు వరిస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఆఫర్ అయితే వచ్చింది కాని కార్తికేయ దాన్ని ఓకే చేస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఆ ఛాన్స్ ను కార్తికేయ ఓకే అంటే మాత్రం తనకు ఇది లక్కీ ఆఫర్ అన్నట్టే.

Read more RELATED
Recommended to you

Exit mobile version