వైరల్; స్విగ్గి డెలివరి బాయ్ లైఫ్ మార్చేసిన సోషల్ మీడియా…!

ప్రతిభకు తగిన ఉద్యోగాలు చేయలేక చాలా మంది అవస్థలు పడుతూ ఉంటారు. ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయో తెలియక, వాటిని ఏ విధంగా సంపాదించాలో అర్ధం కాక ఇబ్బందులు పడుతూ ఉంటారు. చదువు సంగతి పక్కన పెడితే తమ పుటకతో పాటు వచ్చిన ప్రతిభకు గుర్తింపు ఏ విధంగా సంపాదించాలో అర్ధం కాక వాళ్ళు తమ ప్రతిభను వృధా చేసుకుంటూ ఉంటారు. అలాగే విశాల్ అనే స్విగ్గి డెలివరి బాయ్ చాన్నాళ్ళు ఇబ్బంది పడ్డాడు.

కాని అతని ప్రతిభను సోషల్ మీడియా గుర్తించి అతనికి గుర్తింపు తెచ్చి పెట్టింది. వివరాల్లోకి వెళితే విశాల్ స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. తన విధుల్లో భాగంగా ఓ ఇంటికి ఫుడ్ డెలివరీ చెయ్యడానికి వెళ్ళిన అతను, ఇంట్లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన నిఖిల్, డెలివరి తీసుకోవడానికి వచ్చిన విశాల్‌ను మంచినీళ్లు కావాలా అని అడిగగా, కొంచెం కావాలని చెప్పాడు. ఆ తర్వాత విశాల్ నీళ్ళు ఇవ్వగానే,

ఇద్దరి మధ్య మాటలు పెరిగాయి, ఈ మాటల మధ్యలో విశాల్ లో ఉన్న ప్రతిభను నిఖిల్ గుర్తించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. విశాల్ డెలివరి బాయ్ మాత్రమే కాదు ఒక మంచి ఆర్టిస్ట్ అనే విషయాన్ని ప్రపంచానికి చెప్పాడు నిఖిల్. అచ్చుగుద్దినట్టు బొమ్మలు గీస్తా అని అతనికి చెప్పడంతో, విశాల్‌కి సంబంధించిన ఫొటోలు, పూర్తి వివరాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే,

విశేష స్పందన వచ్చి అతని ప్రతిభకు గుర్తింపు దక్కింది. స్విగ్గి కూడా దీనిపై స్పందించింది. తమ పార్టనర్ అభివృద్దికి సహకరిస్తామని చెప్పింది. బాలీవుడ్ సెలబ్రిటీ పూజా భట్ కూడా స్పందించారు. అతన్ని ఎలా కలవాలని అడిగారు. ఇప్పుడు అతనికి మంచి డిమాండ్ ఏర్పడింది. చాలా మంది జాబ్ ఇస్తాం రమ్మని కోరుతున్నారు. అయితే తన గురించి సోషల్ మీడియాలో నిఖిల్ పోస్ట్ చేయడం వలనే తనకు ఇంత పాపులారిటి వచ్చిందనే విషయం విశాల్ కి ఆలస్యంగా తెలిసింది.