వైరల్ వీడియో; ఇంత పెద్ద ఏనుగు మందను ఎప్పుడైనా చూసారా…?

-

కరోనా వైరస్ పుణ్యమా అని జనాలు ఇప్పుడు కేవలం ఇళ్ళకు మాత్రమే పరిమితం అవుతున్నారు. ఇక సోషల్ మీడియాలో కొన్ని వీడియో లు వాళ్ళను మరింతగా అలరిస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో విస్తృతంగా వైరల్ అవుతుంది. భారీ ఏనుగుల గుంపు అంతా కలిసి వెళ్ళడం చూసి సోషల్ మీడియా షేక్ అయింది. భారీ ఏనుగు కుటుంబం తమ గమ్యాన్ని చేరుకోవడానికి ఒక గ్రామం దాటుతూ ఉంటుంది.

ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి పర్వీన్ కస్వాన్ ట్విట్టర్‌లో పంచుకున్నారు. సంఘటన జరిగిన ప్రదేశాన్ని వెల్లడించకుండా, పర్వీన్ కస్వాన్ “మీరు ఎప్పుడైనా చూసారా అతి పెద్ద ఏనుగుల మందని… మీరు వాటిని లేక్కించలేరు… అని ఆయన ఈ వీడియో ని షేర్ చేసారు. మనోహరమైన దృశ్యాన్ని చూడటానికి జనం నిలబడి ఉంటారు అక్కడ. ఆ సమయంలో… ఏనుగుల మంద…

ఒక పొలం గుండా ఒక గ్రామం దాటడంతో వీడియో ప్రారంభమైంది. మొదటి గుంపు దాటిన తర్వాత…, రెండు భారీ ఏనుగుల సమూహాలు కూడా వాటిని అనుసరించాయి కస్వాన్ ప్రకారం, మొత్తం మందను మూడు గ్రూపులుగా విభజించారు మరియు చివరికి వాటిని మొత్తం చిత్రీకరించారు. “ఇది చాలా పెద్ద కుటుంబం” అని పేర్కొన్నారు. క్లిప్ వెంటనే వైరల్ అయ్యింది. లక్షల మంది వీడియో ని వీక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news