“ఆర్ ఆర్ ఆర్” బాహుబలి కి ఏమాత్రం తగ్గదన్న మెగాస్టార్ చిరంజీవి ..!

-

టాలీవుడ్ లో మొదటినుంచి రాజమౌళి కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమా సినిమాకి తన స్థాయిని పెంచుకుంటూ వెళుతున్నారు. ఈరోజు తెలుగు సినిమా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుందంటే అది రాజమౌళి గొప్పదతనే అని చెప్పాలి. బాహుబలి ఫ్రాంఛైజీ తో అన్ని చిత్ర పరిశ్రమలు మన తెలుగు సినిమా గురించే ఆలోచిస్తున్నాయి. ఎప్పుడు ఎలాంటి సినిమా వస్తుందా అన్న ఆతృత అన్ని పరిశ్రమలలోను నెలకొంది. టాలీవుడ్ నుండి ప్రభాస్ కి పాన్ ఇండియా స్టార్ అన్న క్రేజ్ ని సంపాదించి పెట్టారు రాజమౌళి. ఇప్పుడు మొత్తం సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలలో చూసుకుంటే ప్రభాస్ కి ఉన్న క్రేజ్ అసాధారణం.

 

ఇక రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ లతో రౌద్రం రణం రుథిరం సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 90 శాతం షూటిగ్ కంప్లీటయిన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా నిలిపివేయగా పరిస్థితులు చక్కబడ్డాక మిగతా బ్యాలెన్ షూటింగ్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో కంప్లీట్ చేయనున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి అల్లూరి సీతారామజు పాత్రకి సంబంధించిన వీడియో టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ వీడియో టీజర్ ఒక్కసారిగా ప్రేక్షకుల్లోకి దూసుకుపోయింది. అప్పటి నుంచి ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ టీజర్ విషయంలో మెగాస్టార్ చిరంజీవి తాజాగా స్పందించారు. ఆయనకి ఈ టీజర్ విపరీతంగా నచ్చిందని రాజమౌళి చాలా ఇంటిలిజెంట్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. అంతేకాదు చరణ్ టీజర్ లాగే తారక్ టీజర్ కూడా అద్భుతంగా ఉంటుందని అన్నారు. ఇక ఆర్ ఆర్ ఆర్ లో రాజమౌళి రాం చరణ్, ఎన్.టి.ఆర్ లను ఒకరికి ఒకరు ఏమాత్రం తగ్గకుండా చూపించగలిగే సత్తా ఉన్న దర్శకులని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఆర్ ఆర్ ఆర్ బాహుబలి కంటే ఏమాత్రం తగ్గదని ధీమాని వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news