వైరల్ వీడియో; కారులో విసిగిపోయిన కుక్క ఏం చేసిందో చూడండి…!

సాధారణంగా మనుషులు ఎక్కడికి అయినా వెళ్తే వారితో పాటుగా తాము ప్రేమించే పెంపుడు జంతువులు కుక్కలు, పిల్లులను వెంట తీసుకుని వెళ్తూ ఉంటారు. షాపింగ్ లేదా వాకింగ్, ఏదైనా చిన్న పనులు ఉన్నప్పుడు వాటితోనే వెళ్తూ ఉంటారు. వాటిని కారులో కూర్చో పెట్టడమో లేక వాటిని బయటకు తీసుకువెళ్ళడమో చేస్తూ ఉంటారు. తమ పని చూసుకుని వచ్చే వరకు అవి కారులో వేచి ఉంటాయి.

ఇలాగే చేసాడు ఒక వ్యక్తి. కుక్కను తనతో పాటు బయటకు తీసుకువెళ్ళి, దానిని కారులో ఉంచి బయట పని చూసుకోవడానికి వెళ్ళాడు. ఎంత చూసినా సరే ఆ యజమాని రావడం లేదు. కారులో కుక్క దాదాపుగా విసిగిపోయింది. ఎదురు చూసి చూసి ఇక లాభం లేదనుకుందో ఏమో గాని కారు హారన్ మోగించడం మొదలుపెట్టింది. అదే పనిగా కారు హారన్ ని మోగిస్తుంది.

దీనితో గమనించిన దాని యజమాని తిరిగి వచ్చి కారు తలుపు తీసే వరకు కూడా ఆ కుక్క అలాగే మోగిస్తూ ఉంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో స్టీల్ వాన్ హాఫ్ షేర్ చేసిన ఈ వీడియోకి మంచి స్పందన వచ్చింది. “నేను రోజంతా చూసిన ఉత్తమ వీడియో” అని ఒకరు కామెంట్ చేసారు. కాబట్టి కుక్కను కారులో ఎక్కువ సేపు ఉంచకండి. instagram.com/p/B7GKUjXleXU/?utm_source=ig_embed