వైరల్ వీడియో; నీళ్ళ పైపులో ఆరు కొండ చిలువలు…!

ఒడిశాలో పైపుల లోపల ఆరు కొండచిలువలను స్థానికులు కనుగొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒడిశాలోని ధెంకనల్ జిల్లాలో రికార్డ్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. గోజపాడ ప్రాజెక్ట్ గట్టు సమీపంలో అదనపు నీటిని విడుదల చేయడానికి వేసిన పెద్ద పైపు నుండి కొండ చిలువలను రక్షించారు. “ఒడిశాలోని ధెంకనాల్ జిల్లాలోని హ్యూమ్,

పైపు నుండి ఆరు పైథాన్లు స్వాధీనం చేసుకున్నారు. అతిపెద్దది 16 అడుగుల పొడవు ఉంది. అన్నీ సమీప అడవుల్లో విడిచి పెట్టారు అంటూ, ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసారు. “పైథాన్స్ ఎంతకాలం పెరుగుతాయో ఊహించగలరా అని ప్రశ్నిస్తూ ఆయన తన ట్వీట్ ముగించారు. వీడియో ఆధారంగా ఆ కొండచిలువలను గనుక ఒకసారి గమనిస్తే,

రెస్క్యూ గ్రూప్ స్వాధీనం చేసుకున్న పాములు సుమారు 18 అడుగులు, 16 అడుగులు, 12 అడుగులు, 10 అడుగులు, 9 అడుగులు మరియు 8 అడుగుల పొడవు ఉన్నాయి. ఈ వార్తను ఓడిస్సా మీడియా కవర్ చేసింది. అక్కడ ఉన్న స్థానికులు వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించి, విజయవంతంగా బంధించి వాటిని సమీప అడవుల్లో వదిలిపెట్టడంతో అక్కడ ఉన్న వారు ఊపిరి పీల్చుకున్నారు.