కిస్ కామ్ అనేది ఇప్పుడు అమెరికాలో ఫుల్ ట్రెండ్ అయింది. ముఖ్యంగా ఎన్‌బిఎలో బాస్కెట్‌బాల్ మ్యాచ్‌ల సమయంలో ఇది ఒక ప్యాషన్ గా మారిపోయింది అంటే ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, అప్పటి ప్రథమ మహిళ మిచెల్ ఒబామా కూడా అమెరికన్ ఒలింపిక్ జట్టు మరియు బ్రెజిల్ ఆటగాళ్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో విరామ సమయంలో ‘కిస్ కామ్’లో దొరికిపోయారు.
కెమెరాలో ముద్దు పెట్టుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ సౌకర్యవంతంగా లేదా సంతోషంగా ఉండరు. ప్రత్యేకించి ఎవరైనా తెలియకుండా షూట్ చేస్తే తమ బాధ అంతా ఇంతా కాదు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. ఈక్వెడార్‌లో జరిగిన ఒక ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా, ఒక వ్యక్తి తన పక్కన ఉన్న అమ్మాయిని ముద్దుపెట్టుకోవడం కెమెరాలో చిక్కింది. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా,
టెలివిజన్లలో ప్రత్యక్ష ప్రసారం అవుతోందని తెలుసుకున్న వెంటనే అతను జాగ్రత్తపడ్డాడు. అమ్మాయి నుండి దూరం జరిగాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై పలువురు హాట్ కామెంట్ చేస్తున్నారు. మీరు గర్ల్ ఫ్రెండ్ ని కిస్ చేసే సమయంలో టీవీలో మీ భార్య చూస్తుంది అనే విషయాన్ని మర్చిపోవద్దు అని పలువురు కామెంట్ చేస్తున్నారు.
When you kiss your girlfriend, then realise you’re on tv and your wife could be watching ?
pic.twitter.com/ifkvJGuwen— Football Mumble (@football_mumble) January 19, 2020