వైర‌ల్ పిక్‌.. ఫుడ్ బాక్స్‌పై పాము..!

Join Our Community
follow manalokam on social media

ఇండ్ల‌లోకి పాములు రావ‌డం అన్న‌ది స‌హ‌జ‌మే. అనేక మంది ఇండ్ల‌లోకి అప్పుడ‌ప్పుడు పాములు వ‌చ్చి భ‌య పెడుతుంటాయి. అయితే ఏ ప‌ని చేసేముందైనా జాగ్ర‌త్త‌గా ఒక్క‌సారి అన్ని ప్ర‌దేశాల‌ను చూడాలి. ఎందుకంటే ఆయా ప్ర‌దేశాల్లో మ‌న క‌ళ్ల‌కు స‌రిగ్గా క‌నిపించ‌కుండా పాములు ఉంటాయి. అజాగ్ర‌త్త‌గా ఉంటే వాటి కాటుకు బ‌ల‌వ్వాల్సి వ‌స్తుంది. ఓ మ‌హిళ‌కు కూడా ఇలాంటి అనుభ‌వ‌మే ఎదురైంది. కానీ ఆమె పామును ముందుగానే క‌నిపెట్టింది. క‌నుక బతికిపోయింది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..?

woman finds snake on food box

టుక్సాన్ అనే ప్రాంతంలో ఉండే ఓ మ‌హిళ ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డ‌ర్ చేసింది. డెలివ‌రీ బాయ్ ఫుడ్‌ను బ‌య‌ట పెట్టి వెళ్లిపోయాడు. అయితే ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో తెలియ‌దు కానీ ఓ ర్యాటిల్ స్నేక్ ఆ ఫుడ్ బాక్స్‌పైకి ఎక్కి అలాగే ఉంది. ఆ ఫుడ్‌ను తీసుకునేందుకు వ‌చ్చిన మ‌హిళ కొంచెం ఉంటే ఆ బాక్స్ ను పట్టుకుని ఉండేది. ఎందుకంటే ఆ బాక్స్‌పై అస‌లు పాము ఉన్న‌ట్లు క‌నిపించ‌లేదు. అయితే ఆమె ఎలాగో ఆ బాక్స్ మీద పాము ఉంద‌ని గ్రహించింది. దీంతో మొద‌ట షాక్ అయినా త‌రువాత స్నాక్ క్యాచ‌ర్స్ ను పిలిచింది.

ఈ క్ర‌మంలో స్నేక్ క్యాచ‌ర్స్ ఆ పామును పట్టుకుని తీసుకెళ్లారు. అదే స‌మయంలో వారు దాని ఫొటోను కూడా తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ ఫొటో వైర‌ల్ గా మారింది. అయితే అందులో పాము ఎక్క‌డ ఉందో నిజంగా చాలా మంది క‌నిపెట్ట‌లేకపోతున్నారు. చాలా సేపు జాగ్ర‌త్త‌గా చూస్తే త‌ప్ప పాము ఉంద‌ని తెలియ‌డం లేదు. క‌నుక ఎవ‌రైనా స‌రే.. ఏ ప‌ని చేసే ముందైనా కాస్త ముందు వెనుకా చూసి చూస్తే బాగుంటుంది. లేదంటే అలాంటి అనుకోని ప్ర‌మాదాల బారిన ప‌డాల్సి వ‌స్తుంది.

TOP STORIES

జీవితంలో గెలవడానికి అలవర్చుకోవాల్సిన ఐదు అలవాట్లు..

కొన్ని అలవాట్లు మన జీవితాలని మార్చేస్తాయి. అలాగే మరికొన్ని అలవాట్లు మనల్ని విజయ తీరాలకి దూరంగా పడవేస్తాయి. ఇంకొన్ని అలవాట్లు విజయ సంద్రంలో నిత్యం తడిచేలా...