దుర‌దృష్టం అంటే అదే.. రూ.190 కోట్ల లాట‌రీ టిక్కెట్‌ను లాండ్రీలో పోగొట్టుకుంది..

-

దేవుడు నిజంగానే కొన్నిసార్లు మ‌న‌కు ప‌రీక్ష పెడ‌తాడేమో. బంగారం మూట‌ను మ‌న క‌ళ్ల ముందు ప‌డేసినా మ‌నం కొన్ని సార్లు చూడ‌కుండా వెళ్తాం. దీన్ని కొన్ని సినిమాల్లో మ‌నం చూశాం. కొన్ని క‌థ‌లు కూడా ఉన్నాయి. అయితే ఆ మ‌హిళ‌కు కూడా స‌రిగ్గా ఇలాగే దుర‌దృష్టం ఎదురైంది. రూ.190 కోట్లను లాట‌రీలో గెలుచుకుంది. కానీ దాని తాలూకు టిక్కెట్‌ను ఆమె లాండ్రీలో పొగొట్టుకుంది. వివ‌రాల్లోకి వెళితే…

woman won rs.190 crore lottery but lost ticket

కాలిఫోర్నియాకు చెందిన ఓ మ‌హిళ లాస్ ఏంజ‌ల్స్‌లోని ఓ స్టోర్‌లో గ‌త నవంబ‌ర్ 14వ తేదీన 26 మిలియ‌న్ డాల‌ర్లు (దాదాపుగా రూ.190 కోట్లు) విలువ చేసే లాట‌రీ టిక్కెట్‌ను కొనుగోలు చేసింది. అదృష్ట‌వ‌శాత్తూ ఆమెకు లాట‌రీ త‌గిలింది. కానీ లాట‌రీ టిక్కెట్‌ను ఆమె ప్యాంట్ జేబులో ఉంచి దాన్ని లాండ్రీకి వేసింది. త‌రువాత ఆ విష‌యం తెలుసుకుంది. అప్ప‌టికే టిక్కెట్ పోయింది. దీంతో తీవ్రంగా బాధ‌ప‌డింది.

అయితే ఆమె టిక్కెట్‌ను కొనుగోలు చేసిన‌ట్లు రుజువులు చూపిస్తే ఆమెకు ఆ మొత్తం ద‌క్కుతుంది. లేదంటే ఆ మొత్తంలోంచి కొంత డ‌బ్బు కాలిఫోర్నియాలోని ప‌బ్లిక్ స్కూల్స్‌కు విరాళంగా వెళ్తుంది. కొంత మొత్తాన్ని టిక్కెట్ అమ్మిన స్టోర్ వారికి బోన‌స్‌గా ఇస్తారు. మ‌రి ఆ మహిళ ఏం చేస్తుందో చూడాలి. అంత భారీ మొత్తంలో డ‌బ్బును లాట‌రీ గెలుచుకున్నా టిక్కెట్‌ను కోల్పోయింది. దుర‌దృష్టం అంటే ఆమెదే అని చెప్ప‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news