ఈ భూమి మీద ఉన్న ప్రతీజీవికి జీవించడానికి హక్కు ఉంటుంది. అలాగే ప్రతీ జీవికి తనని కాపాడుకునే నైపుణ్యాలు ఉంటాయి. అడవుల్లో ఉండే జంతువులకి ఇలాంటి నైపుణ్యాలు ఎక్కువగా ఉంటాయి. చిన్న చీమకైనా ఆపద నుండి తనను తాను రక్షించుకునే గుణం ఉంటుంది. అవేవీ ఇతర జంతువుల మీద ఆధారపడవు. కానీ మనిషి తనను కాపాడుకునే నైపుణ్యాన్ని మర్చిపోతున్నాడు. అడవుల నుండి దూరమయ్యాక ఆ నైపుణ్యాలని మర్చిపోయాడు.
మీరు కూడా మర్చిపోయారో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఐతే బుష్ క్రాఫ్ట్ చేసేయండి. బుష్ క్రాఫ్ట్ అంటే ఏంటని సందేహమా? అడవిలో ఒంటరిగా చెట్ల మధ్య, పుట్టల మధ్య తిరుగుతూ, కావాల్సిన ఆహారాన్ని, గూడుని సంపాదించుకుని, ఇతర జంతువుల నుండి కాపాడుకుంటూ ఉండడం. ఇది కేంపింగ్ చేసినంత సులభం కాదు. అడవిలో నీళ్ళు ఎక్కడున్నాయో వెతకాలి. ఇలా బుష్ క్రాఫ్ట్ చేయడానికి దాదాపు అన్నిదేశాలు అనుమతి ఇస్తున్నాయి.
బుష్ క్రాఫ్ట్ గురించిన పుస్తకాలు ఉన్నాయి. ఇందులో మనల్ని మనం కాపాడుకునే ఎన్నో నైపుణ్యాలు ఉన్నాయి. బుష్ క్రాఫ్ట్ సెట్ మార్కెట్లో దొరుకుతుంది. అందులో అవసరమైనవన్నీ ఉంటాయి. బ్లేడు, గొడ్డలి, ఫస్ట్ ఎయిడ్, హెడ్ లైట్, కత్తి, బీన్ బ్యాగ్.. ఇలా అన్నీ ఉంటాయి. నీతో మాట్లాడడానికి ఎవరూ లేని ఆ ప్రదేశంలో నీ పనితీరు ఎక్కువగా ఉంటుంది. అడవిలోని ప్రతీశబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. నీకు నువ్వు కొత్తగా పరిచయం అవుతావు. అడవిలో దారులు తెలియవు కాబట్టి, వీరిదగ్గర ఖచ్చితంగా కంపాస్ ఉంటుంది. ఇంకా, శాటిలైట్ ఫోన్ పెట్టుకోవాలి. ఏదైనా అత్యవసర సమయంలో అది ఉపయోగపడుతుంది. ఒక్కరే బుష్ క్రాఫ్ట్ చేసే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు.