కావాలని చేసిందా? తాగిన మైకంలో చేసిందా? అంతుచిక్కని వీడియో

3232

రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును ఒకసారి ఢీకొట్టింది. సరే… యాక్సిడెంటల్ గా జరిగి ఉంటుంది అని అనుకుంటున్నారా? తొందరపడకండి. మరోసారి ఢీకొట్టింది. యూటర్న్ తీసుకొని మరీ మరోసారి ఢీకొట్టింది.

మీరు రోజూ ఎన్నో వీడియోలు చూస్తుంటారు. కానీ.. ఇటువంటి వీడియోను మాత్రం చూసి ఉండరు. ఆ వీడియో చూడటానికి ముందు దాని గురించి కొంచెం తెలుసుకోవాలి కదా.

అది మహారాష్ట్రలోని పూణె. రాత్రి సమయం. రామ్ నగర్ ప్రాంతం. అంతా నిర్మానుష్యంగా ఉంది. ఇంతలో ఒక కారు అక్కడికి వచ్చింది. దాన్ని డ్రైవ్ చేసేది ఓ యువతి. రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును ఒకసారి ఢీకొట్టింది. సరే… యాక్సిడెంటల్ గా జరిగి ఉంటుంది అని అనుకుంటున్నారా? తొందరపడకండి. మరోసారి ఢీకొట్టింది. యూటర్న్ తీసుకొని మరీ మరోసారి ఢీకొట్టింది. ఇలా ఒకసారి కాదు.. రెండు సార్లు కాదు.. ఏకంగా ఐదుసార్లు ఆగిఉన్న కారును ఢీకొట్టి… కసి తీర్చుకొని అప్పుడు అక్కడి నుంచి తుర్రుమన్నది.

ఎహె.. ఊరుకోండి. అక్కడ సినిమా షూటింగ్ జరిగింది కదా అంటారా? అస్సలు కాదు. అది షూటింగ్ కాదు గీటింగ్ కాదు. నిజంగా జరిగిన ఘటన. ఆ ఘటనను చూసి స్థానికులే బిత్తరపోయారు. అలా చూస్తూ ఉండిపోయారు. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకీ ఆ యువతి ఆగి ఉన్న కారును ఎందుకు అంత కసితో ఢీకొట్టి ఉంటుందంటారు. పోలీసులు, స్థానికులైతే యువతి మద్యం మత్తులో ఉండి అలా చేసి ఉండొచ్చు.. అని అనుకుంటున్నారు. మరి మీరేమంటారు. సరే..ఇప్పుడు వీడియో చూసేయండి.