హ్యాప్పీ బర్త్‌డే మెగాస్టార్.. చిరంజీవికి తమ్ముడు పవన్ కల్యాణ్ ప్రత్యేక లేఖ..!

-

మెగాస్టార్ జన్మదినం సందర్భంగా ఓవైపు అభిమానులు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుంటే మరో వైపు సోషల్ మీడియాలో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఆయనకు బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. ఇక చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవి.. ఎంతో మందికి ఆదర్శం.. సినీ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా ఎదగాలంటే.. డబ్బు లేదా పలుకుబడి.. ఏదో ఒకటి ఉండాలి. కానీ అవేవీ లేకుండా చాలా కష్టపడి ఆయన ఈ స్టేజ్‌కు వచ్చారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన మెగాస్టార్‌గా అందరి మన్ననలు పొందుతున్నారు. కాగా ఇవాళ ఆయన జన్మదినం సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి.

pawan kalyan special birth day wishes to chiranjeevi

మెగాస్టార్ జన్మదినం సందర్భంగా ఓవైపు అభిమానులు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుంటే మరో వైపు సోషల్ మీడియాలో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఆయనకు బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. ఇక చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు పవన్ తన సోదరుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్ వేదికగా ఓ లేఖను కూడా విడుదల చేశారు. అందులో పవన్ ఏమన్నారంటే..

తనకు స్ఫూర్తిప్రదాత అయిన చిరంజీవి జన్మదినం.. అభిమానులందరికీ పండుగ రోజని పవన్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఆయన జీవితం యువతకు స్ఫూర్తినిస్తుందని అన్నారు. ఆయనలో ఉన్న క్రమశిక్షణ, పట్టుదలే ఆయన్ను ఈ స్థాయికి చేర్చాయన్నారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యలవాడ నరసింహారెడ్డి జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న సైరా మూవీ మెగా అభిమానులకు చిరంజీవి అందిస్తున్న కానుక అని పవన్ అభివర్ణించారు. జనసేన పార్టీ కార్యకర్తల తరఫున చిరంజీవికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు..!

Read more RELATED
Recommended to you

Latest news