భారత్‌లో కాస్త తగ్గిన కరోనా…అయిన భారీగానే.

-

భారత్‌లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది..అయితే, తాజా కేంద్ర ఆరోగ్యశాఖ బులెటిన్‌లో కేసుల సంఖ్య కాస్త తగ్గింది. కానీ, కరోనా కల్లోలం మాత్రం కొనసాగుతూనే ఉంది..కరోనా పాజిటివ్ కేసులు 66,85,083 మార్క్‌ను క్రాస్ చేశాయి..కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా హెల్త్‌ బులెటిన్‌ ప్రకారం..గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 61,267 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, 884 మంది మృతిచెందారు..ప్రస్తుతం దేశంలో 9,19,023 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి..56,62,491 మంది కరోనాబారినపడి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 1,03,569 కు పెరిగినట్టు కేంద్రం తన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది..మరోవైపు సోమవారం రోజు దేశవ్యాప్తంగా 10,89,403 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని..ఇప్పటి వరకు చేసిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 8,10,71,797కి చేరినట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version