తెలంగాణలో బతుకమ్మ సంబరాలకు సర్కారు ఏర్పాట్లు..

-

తెలంగాణ ఖ్యాతిని పెంచే పండగ బతుకమ్మ..ప్రతి ఏడాదిలాగా ఈ ఏడాది కూడా తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగకు సిద్దమౌతుంది.రాష్ట్ర వ్యాప్తంగా మరో ఆరు రోజుల్లో బతుకమ్మ సంబరాలు మొదలు కానున్న నేపథ్యంలో సోమవారం బీఆర్కే భవనంలో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు.9 రోజుల పాటు నిర్వహిస్తారు.ఈసారి బతుకమ్మ పండుగ సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 3 వరకు  జరగనున్నాయి. అక్టోబర్ 3న ట్యాంక్ బండ్ వద్ద బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు.

బతుకమ్మ ఉత్సవాల నిర్వహణపై హైదరాబాద్ బీఆర్‌కే భవన్‌లో సీఎస్ సోమేశ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, డీజీపీ మహేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారుల సమన్వయ సమావేశం జరిగింది. ఉన్నారు..ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి మాట్లాడుతూ..హైదరాబాద్ తో పాటు అన్నీ జిల్లాల్లో బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నట్లు తెలిపారు.అక్టోబర్ 3 వరకు సద్దుల బతుకమ్మ ఉత్సవాలు జరుగుతాయని,ఆ కార్యక్రమానికి భారీ సంఖ్యలో మహిళలు హాజరుకానున్నారు.ఈ మేరకు ట్యాంక్ బండ్ సమీపంలో విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు.. నగరం మొత్తం ప్రత్యేక దీపాలను ఏర్పాటు చేయనున్నారు..

పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్య నిర్వహణ, రోడ్డు రిపేర్ వర్క్స్ వెంటనే చేపట్టాలి. ఈ సారి మహిళలు ఉత్సవాలలో భారీ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నింటినీ విద్యుత్ దీపాలతో అలంకరించాలి. బతుకమ్మలను నిమ్మజ్జనం చేసే ప్రాంతాల్లో ఏవిధమైన ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాళ్లను నియమించాలి బతుకమ్మ పండగ పై ఆకర్షణీయమైన డిజైన్ లతో మెట్రో పిల్లర్లను అలంకరించాలి.’ అని అధికారులను సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు.

ఎల్బీ స్టేడియం నగరంలోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మ లోగో లను ఏర్పాటు చేయాలని సోమేశ్ కుమార్ చెప్పారు. నిర్వహణ ఏర్పాట్లు కూడా ఘనంగా ఉండాలన్నారు. భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నిర్వాహణ, ట్యాంక్ బండ్ వద్ద విద్యుత్ దీపాలంకరణ, బారికేడింగ్, తాగునీటి సౌకర్యం, మజ్జిగ ప్యాకెట్స్ సరఫరా, మొబైల్ టాయిలెట్స్, నిరంతర విద్యుత్ సరఫరా వంటివి చూసుకోవాలని ఆదేశించారు. ఉత్సవాల లైవ్ టెలికాస్ట్ ప్రసార మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు..

బతుకమ్మ ఉత్సవాలు మన రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైనవని ఏర్పాట్లను ఘనంగా చేయాలని ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అధికారులకు సూచించారు. శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 25 వతేది నుంచి ప్రారంభం కానున్నాయన్నారు. అందులో భాగంగా బతుకమ్మ ఉత్సవాలు కూడా అదే రోజున ప్రారంభం అవుతాయని చెప్పారు. 9 రోజుల పాటు జరిగే బతుకమ్మ ఉత్సవాలు నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు.ఉత్సవాలకు కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో అధికారులు పనులను వేగవంతము చేస్తున్నారు..

 

Read more RELATED
Recommended to you

Exit mobile version