ఒక్కోసారి మన అవసరమే మనల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఒడిషా రాష్ట్రం తింగల్కన్ ఊరికి చెందిన కతర్, బుడు, భికారి అనే ముగ్గురు కూలీలు పొట్ట కోటి కోసం ఉన్న ఊరిని కూడా వదిలేసి బెంగళూర్ మహానగరంలో ఏదైనా పని చేసుకుని బ్రతకడానికి వచ్చారు. అయితే ఎలాగోలా ఒక మనిషి ద్వారా ఒక కంపెనీ లో ఉద్యోగం దొరికింది. ఆ కంపెనీ లో ఎంతో నమ్మకంగా నెల రోజులు ఉద్యోగం చేశారు. ఆ తర్వాత జీతం ఇచ్చే సమయానికి యజమాని మాట దాటి వేయడం వీరికి అర్థమైంది. ఎంత అడిగినా ఇవ్వకపోవడంతో మోసపోయామని గ్రహించి తిరిగి సొంత ఊరు వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు.
కానీ చేతిలో డబ్బులు లేకపోవడంతో బెంగళూర్ నుండి ఒడిశాకు కాలి నడకన వెళ్ళడానికి దైర్యం చేశారు. బెంగళూర్ నుండి ఒడిశాకు మొత్తం 1000 కిలోమీటర్లు నడిచి వెళ్ళారు. వీరి దైర్యానికి ఆత్మవిశ్వాసానికి మెచ్చుకోవాలి. అలాగే ఇలాంటి మోసం చేసే యజమానులను కుక్కను కొట్టినట్లు కొట్టి తరమాలి.