సూర్యగ్రహణంలో ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాల్సిందే?

-

మన దేశంలో దీపావళి సంబరాలు మొదలైయ్యాయి.. నిన్న దేశ వ్యాప్తంగా దీపావళి పండుగను జరుపుకున్నారు.నేడు కూడా పండుగనే..దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానిస్తూ అందరూ పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఈసారి దీపావళి పండుగ కాస్త ప్రత్యేకం అని చెప్పవచ్చు. ఎందుకంటే 27 ఏళ్ల తరువాత సూర్యగ్రహణం దీపావళి పండుగ రోజున వస్తోంది. అంటే 1995లో దీపావళి రోజున ఏర్పడిన సూర్యగ్రహణం మళ్లీ ఇప్పుడు రాబోతుందన్నమాట.

అంటే దీపావళి పండుగ రోజున సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. అలాగే ఈ ఏడాది రెండో చివరి సూర్యగ్రహణం కూడా ఇదే. అమావాస్య ముగిసిన తర్వాత ఈ గ్రహణం ఏర్పడునుంది. అయితే ఈ గ్రహణం రోజున కొన్ని రకాల విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. మరి దీపావళి రోజున ఎటువంటి పనులు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గ్రహణ సమయంలో భోజనం చేయకూడదు. అలాగే గ్రహణ సమయంలో పళ్ళుశుభ్రం చేసుకోవడం తల దువ్వుకోవడం లాంటివి చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అలాగే గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదు..ఇంకా పిల్లలు లేని వాళ్ళు శారీరకంగా నేడు కలవకూడదని అంటున్నారు.
గ్రహణ సమయంలో ఎటువంటి శుభకార్యాలు జరగవు కాబట్టి ఈ సమయంలో ఎటువంటి పూజలు చేయకూడదు.

అలాగే,గ్రహణం సమయంలో సూర్యునికి నేరుగా శరీరం బహిర్గతం కాకుండా ఉండండి. గ్రహణ సమయంలో వంట చేయడం, తినడం మానుకోండి. సూర్యుడిని కంటితో చూడవద్దు. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంటి నుండి బయటకు రాకూడదు. గ్రహణానికి ముందు వండిన ఆహారం తినకూడదు. గ్రహణానికి ముందు నీరు, అన్నం, ఇతర ఆహార పదార్థాలపై తులసి ఆకుల్ని వేయండి.  గ్రహణం సమయంలో నిద్రించడం లేదా బయటికి వెళ్లడం మానుకోండి.

వంట గదిలో మనం తయారు చేసుకున్న ఆహార పదార్థాలలో తులసి ఆకులను ఉంచడం మంచిది. ఈ క్రమంలోని సూర్యభగవానున్ని పూజించి ఆయన మంత్రాన్ని పారాయణం చేయడం మంచిది. గ్రహణం ముగిసిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకోవాలి. అలాగే మీరు నివసించే ప్రదేశాలలో గంగాజలం చల్లాలి. గ్రహణం అయిపోయిన తర్వాత స్నానం చేయడం,ఇంటి మూలలను తప్పక శుభ్రం చెయ్యాలి..పూజ గదిని కూడా శుభ్రం చేసుకోవాలి..

Read more RELATED
Recommended to you

Latest news