పండుగరోజు నైవేద్యంగా రవ్వ పులిహోర.. తయారీ ఇలా

-

కావలసిన పదార్థాలు :
రవ్వ – ఒక కప్పు
పచ్చిమిరపకాయలు – 5
పల్లీలు – పావు కప్పు
కరివేపాకు – నాలుగు రెమ్మలు
నిమ్మకాయలు – 2
ఎండు మిరపకాయలు – 2
శనగపప్పు – 2 టేబుల్‌ స్పూన్స్‌
మినపప్పు – ఒక టేబుల్‌ స్పూన్‌
ఆవాలు – అర టీ స్పూన్‌
జీలకర్ర – అర టీ స్పూన్‌
పసుపు – పావు టీ స్పూన్‌
ఉప్పు, నూనె – తగినంత


తయారు చేసే విధానం :
రెండు కప్పుల నీళ్ళు మరిగించి అందులో ఉప్పు, పసుపు వేయాలి. దీంట్లో రవ్వ పోసి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. ముద్దలా కాకుండా పొడి, పొడిగా ఉండేట్లుగా చూసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేటులో వేసి పక్కన పెట్టాలి.

కడాయిలో నూనె పోసి ఆవాలు, జీలకర్రవేగాక పల్లీలు వేసి వేయించాలి. ఆ తర్వాత శనగపప్పు, మినపప్పు వేసి వేగనివ్వాలి. దీంట్లో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి రెండు నిమిషాలపాటు కలిపి దించేయాలి. కాస్త చల్లారాక వేయించుకున్న

రవ్వలో కలపాలి. ఆ పైన ఈ మిశ్రమంలో నిమ్మరసం, సరిపడినంత ఉప్పు వేయాలి. వేడి.. వేడి.. రవ్వ పులిహోర మీ ముందుంటుంది. దీన్ని రెండుగంటలు అలాగే ఉంచి ఆ తర్వాత తింటే బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news