అమ్మవారి పాటలైతే యూట్యూబ్‌లో మనకు లెక్కలేనన్ని పాటలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎన్ని పాటలు ఉన్నా.. వాటిలో భిన్నమైన అంశాల మేళవింపు కలిగిన పాటలు కొన్నే ఉంటాయి.
దసరా నవరాత్రి ఉత్సవాలు వస్తున్నాయంటే చాలు.. వాడ వాడలా అమ్మవారి మండపాల్లో సందడి నెలకొంటుంది. భక్తుల పూజా కార్యక్రమాలతోపాటు మండప పరిసర ప్రాంతాల్లో అమ్మవారి పాటలు హోరెత్తుతుంటాయి. ఆ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. అయితే ఇంటర్నెట్ పుణ్యమా అని మనకు ఇప్పుడు ఎలాంటి పాటలకైనా కొదువ లేదు. అందులోనూ ఇక అమ్మవారి పాటలైతే యూట్యూబ్‌లో మనకు లెక్కలేనన్ని పాటలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎన్ని పాటలు ఉన్నా.. వాటిలో భిన్నమైన అంశాల మేళవింపు కలిగిన పాటలు కొన్నే ఉంటాయి. వాటిల్లో ఈ పాట కూడా ఒకటి..!
యూట్యూబ్‌లో ఉన్న అధాన్ మ్యూజిక్ చానల్‌లో పలువురు ఔత్సాహికులు కలిసి చేసిన అయిగిరి నందిని ర్యాప్ వెర్షన్ నవరాత్రి స్పెషల్ సాంగ్ ఇప్పుడు వ్యూయర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇంటి నుంచి బయటకు వెళ్లే మహిళలు మళ్లీ ఇంటికి సురక్షితంగా తిరిగి వస్తారో, రారో తెలియని ఆందోళనకర పరిస్థితులు ప్రస్తుత సమాజంలో నెలకొన్నాయనే విషయాన్ని ఈ పాటతో మనకు చక్కగా తెలియజేశారు. ఈ క్రమంలోనే ఈ పాటకు వీక్షకుల ఆదరణ కూడా లభిస్తోంది.
మహిళలు తమను వేధింపులకు గురి చేసే వారి పట్ల అమ్మవారిలా, మహిషాసుర మర్దినిలా మారాలని ఈ పాట మనకు తెలియజేస్తుంది. మరింకెందుకాలస్యం.. ఈ పాటపై ఓ లుక్కేయండి మరి..!