శివరాత్రి పండుగ ఎలా నిర్ణయిస్తారు.. పాటించాల్సిన నియమాలు

-

సనాతన సంప్రదాయంలో ప్రతీదాని వెనుక తెలియని శాస్త్రీయత ఉంటుంది. ప్రకృతిలోని మార్పులను, కాలాలను, కర్మలను అన్నింటిని మిళితం మన పండుగలు. అయితే వాటిలో ఎక్కువ పండుగలు… తిధులతోను, నక్షత్రాలతోను ముడిపడి ఉంటాయి. కొన్ని పండగలకు తిధులు, మరికొన్ని పండగలకు నక్షత్రాలు ప్రధానమవుతాయి. ఈ పద్ధతిలో ప్రతి నెల చాంద్రమాసము ప్రకారం కృష్ణ పక్షమిలోని ప్రదోష వ్యాప్తిగల చతుర్ధశి తిధిని మాస శివరాత్రి అంటారు. ఇది శైవులకు ఉపవాస వ్రతములకు ముఖ్యమైనదిగా భావించి శివున్ని కొలుస్తారు. సూర్యాస్తమ యానికి మందు 6 ఘడియలను ప్రదోషకాల మంటారు. అదేవిధంగా ప్రతీమాసంలో శివరాత్రి వస్తుంది. కానీ సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమే మహా శివరాత్రి అదే మాఘమాసంలో వచ్చే శివరాత్రి.

మాఘమాసములో కృష్ణ పక్ష చతుర్ధశి అర్ధరాత్రి వ్యాప్తి చెంది ఉన్నరోజును మహాశివరాత్రిగా పరిగణింపబడునని ధర్మసింధువు వంటి శాస్త్రగ్రంధాలు పేర్కొంటున్నాయి. అమావాస్యకు ముందు వచ్చే కృష్ణ పక్ష చతుర్ధశినాడే శివరాత్రి జరుపుకొవాలని శాస్త్ర నిర్ణయము. సంక్రాంతి పండగ తర్వాత వచ్చే పండగలలో ముఖ్యమైనది మహాశివరాత్రి.అన్ని పండగలు పగటి పూట జరుపుకుంటే ఈ పండగ మాత్రం రాత్రిపూట జరుపుకుంటాము.

మహా శివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వది కాలం. కాబట్టి శివుడి అనుగ్రహం కొరకు రాత్రి మేలుకొని భక్తితో అభిషేకాలు,పూజలు,భజనలు చేస్తారు. అందుచేత శివరాత్రిగా పిలవబడుతుంది.ఇది హిందువులకు ముఖ్యంగా శైవులకు అత్యంత పుణ్య ప్రదమైన రోజు. మహ శివరాత్రి ని హిందువులు ఏంతో గొప్పనైన పర్వదినంగా జరుపుకొని శివున్ని కొలిచి తరిస్తారు.

మహా శివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసినవి మూడు ఉన్నాయి ఉపవాసం ఉండటం , రాత్రి జాగరణ చేయడం, శివనామ స్మరణతో అభిషేకాలు చేయడం మాత్రం మరువకూడదు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం తప్పక తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అల్పాహారం, పండ్లు, పాలు తీసుకోవచ్చు. దీనిలో వాదోపవాదాలకు అవకాశం లేదు. అన్నింటికంటే ప్రధానం పరమశివుడిపై శ్రద్ధ, భక్తితో, ఆసక్తితో ఆయన్ను ఆశ్రయిస్తే చాలు తప్పక అనుగ్రహిస్తాడు ఆ మహాదేవుడు. హరహర మహాదేవ !

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news