ఉగాది రోజు ఏ సమయంలో కొత్త పనులు ప్రారంభించాలో మీకు తెలుసా ?

-

ఉగాది.. తెలుగు కొత్త సంవత్సరం. వికారి సంవత్సరం పోయి శార్వరీ నామ సంవత్సరం వస్తుంది. అసలు ఉగాది అంటే.. యుగానికి ఆది అని అర్థం. ఈ పండగ జరుపుకోని తెలుగు వారు ఉండరు. ఈ ఉగాది ఒక్క తెలుగువారే కాకుండా దక్షినాది రాష్ట్రాలైన కర్ణాటక, ఆంద్ర ప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్ర ప్రజలు కూడా ఎంతో ఆనందంగా జరుపుకొంటారు. ఈ పండగను షడ్రుచుల సమ్మేళనంగా పిలుస్తారు. ఆ రోజు ఉగాది పచ్చడి, పిండివంటలు, మామిడి తోరణాలతో తెలుగు లోగిళ్లు అన్ని కళకళలాడుతాయి. ఈ పండగ చైత్ర మాస చైత్ర మాస శుద్ధ పాడ్యమి నాడు వస్తుంది.

సృష్టి ప్రారంభమైన రోజు

ఉగాది రోజునే.. బ్రహ్మ సమస్త సృష్టినీ ప్రారంభించిండని పురాణాలు పేర్కొంటున్నాయి. వైకుంఠనాథుడు మత్స్యావతారాన్ని ధరించి, సోమకుడిని సంహరించి వేదాలను కాపాడింది కూడా ఉగాది రోజునే. అలాగే ఈ ఏడాది ఉగాది 2020 మార్చి 25వ తేదీన బుధవారం వస్తోంది.  కానీ ఈసారి కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల దేవాలయాలలో ఈ పండుగ విశేషంగా జరుపుకోకపోవచ్చు. కేవలం ఇంట్లోనే ఉండి ఈ పండుగ జరుపుకోవాల్సిన పరిస్థితి. ఉగాది రోజున ఏం చేయాలి? మంచి  సమయం ఎప్పుడు? ఆసమయంలో ఏం చేయాలి? తెలుసుకుందాం…

ఎందుకంటే.. మనకు తెలియకుండా కొన్ని కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. పండుగ రోజంతా ఉంటుంది కాబట్టి చేయాలనుకున్న పనులు ఏ సమయంలో అయినా చేయవచ్చు అనుకుంటారు. కానీ, అది సరైనది కాదు. మంచి సమయంలో మంచి పనులు చేస్తేనే కష్టాలు దరిచేరకుండా ఉంటాయి. ఇక అసలు విషయంలోకి వస్తే.. 25వ తేదీ, అనగా బుధవారం ఉదయం గం. 6 నుండి 11 గం. లోపు ప్రతి ఒక్కరూ ఉగాది పూజను పూర్తి చేసుకోవాలి. ఆ సమయంలోనే ఉగాది పచ్చడిని కూడా చేసేసుకోవాలి.

ఇక ఉగాది రోజున పడమర దిశకు ప్రయాణం చేయడం మంచిది. బుధవారం 25వ తేదీ ఉదయం 6గంటల నుండి 11 గంటల వరకూ అలాగే మద్యాహ్నం 1:30 నిమిషాల నుండి సాయంత్రం 4.30 నిమిషాల సమయంలో ప్రయాణాలు శుభం కలిగిస్తాయి. అయితే ఉత్తర దిశ ప్రయాణాలు కలిసిరావు. కాబట్టి ఆ దిశవైపు ప్రయాణం చేయకండి. అలాగే ఉదయం 11 గంటల లోపు కొత్త వస్తువులు కొనుగోలు చేయడం ఉత్తమం. ఉదయం పూజ సమయంలో లేదా మద్యాహ్నం 1:30 నిమిషాల నుండి సాయంత్రం గం.4.30 లోపు కాని అకౌంట్స్‌ పుస్తకాలు ప్రారంభించుకోవడం వల్ల అంతా శుభం జరుగుతుంది. వ్యాపారులు లాభాలు కూడా పొందొచ్చు. ఇక ఏదైనా కారణంతో ఆలస్యంగా పైన చెప్పిన సమయాలలో పనులు చేయకుంటే భగవంతుడిపై భారంవేసి సత్‌ సంకల్పంతో ఏ సమయంలోనైనా సరే శుచి, శుభ్రతతో పనులు ప్రారంభించండి.

Read more RELATED
Recommended to you

Latest news