వేప నూనెతో ఈ సమస్యలకి చెక్ పెట్టేయండి…!

Join Our Community
follow manalokam on social media

మనకి వేప నూనె మార్కెట్లో దొరుకుతూనే ఉంటుంది. దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. జుట్టు ఎదుగుదలకు, చర్మ సంరక్షణ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో దీనికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. హోమియోపతి యునాని వంటి వాటిలో విరివిగా వాడుతూనే ఉంటారు. దీని సువాసన చాలా ఘాటుగా ఉంటుంది. దీనిని ఉపయోగించడం వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆధునిక వైద్యం లో అనేక రకాల వ్యాధులకు వేప నూనెను ఉపయోగించి చెక్ పెడుతున్నారు. ఇక వేప నూనె వల్ల కలిగే ప్రయోజనాలు చూద్దాం..!

కణితి గాయాలను తగ్గిస్తుంది:

వేప నూనె ఉపయోగించడం వల్ల ఈ గాయాలు మానిపోతాయి. కొన్ని రకాల చర్మ రోగాలకు ఆపరేషన్ చేయడం ద్వారా చర్మం పై ఉండే గాయాలు మానాలంటే వేప నూనె సరైనది. కాబట్టి ఎప్పుడైనా ఇటువంటి గాయాలు మీ చర్మం పై ఉండిపోతే దీనిని ఉపయోగించండి.

నోటి ఆరోగ్యం:

దంత సంరక్షణ సరిగా లేకపోతే దంతాల పై పచ్చని పొర ఏర్పడి అనేక రకాల బ్యాక్టీరియా అభివృద్ధికి దారితీస్తుంది. అలానే దంతక్షయం వంటివి కూడా వస్తాయి. వేప నూనె ఉపయోగించడం వల్ల దంతక్షయం వంటి రోగాలు తగ్గిపోతాయి. అలానే నోటి వ్యాధులు కూడా నయం అయిపోతాయి.

మొటిమలను తగ్గిస్తుంది:

వేప నూనె లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. దీని వల్ల ఇది మొటిమలు తగ్గించడంలో ఉపయోగ పడుతుంది. మీరు 1స్పూన్ వేప నూనెలో టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ ని కలిపి మొటిమలున్న చోట అప్లై చేయండి. గంట తర్వాత వాష్ చేసుకోండి. మొటిమలు తగ్గిపోతాయి.

జుట్టు సంరక్షణకి:

వేప నూనె ఉపయోగించడం వల్ల జుట్టు ఊడిపోవడం వంటి సమస్యలు తగ్గిపోతాయి. జుట్టు తెల్లబడటం వంటివి కూడా దూరం అయిపోతాయి.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...