ఆకాకరకాయ తింటే ఆహా అనాల్సిందే..!

-

ఆకాక‌ర‌కాయ చిన్నగా ఉండి, రుచిలో చేదు లేకుండా ఉంటుంది. నాటు కాకరకాయ అంత చేదు ఉండ‌దు కాబట్టి ఎవరైనా ఇష్టంగా తింటారు. ఆకాక‌ర‌లో పోష‌కాలు కూడా ఎక్కువే ఉంటాయి. వీటిని మ‌న ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల చాలా ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు కలుగుతాయి.ఆకాక‌ర‌కాయ లో విట‌మిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. కంటి చూపు స‌మ‌స్య‌లను దూరంగా ఉంచుతుంది. ఆకాక‌ర కాయ‌ల్లో విట‌మిన్ సి పుష్క‌లంగా లభిస్తుంది. శ‌రీర రోగ నిరోధక శక్తి నీ పెంచుతుంది. ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా పోరాడుతుంది.

అంతే కాకుండా ఫ్రీ ర్యాడిక‌ల్స్ వ‌ల్ల క‌లిగే న‌ష్టాన్ని నివారిస్తుంది.ఆకాక‌ర కాయ‌లు మ‌ధుమేహం ఉన్న వారికి ఎంత‌గానో మేలు చేస్తాయి. ఇవి ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిల‌ను త‌గ్గిస్తాయి. ఇన్సులిన్ లెవ‌ల్స్‌ను పెంచుతాయి. మ‌ధుమేహం వ‌ల్ల వ‌చ్చే ఇతర అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా దూరం చేస్తాయి. వీటిలో పైటో న్యూట్రియంట్లు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి క్యాన్స‌ర్‌ల‌ను న‌యం చేస్తాయి.క్యాన్స‌ర్ క‌ణ‌తుల‌ను పెర‌గ‌నీయ‌కుండా అడ్డుకుంటాయి. క్యాన్స‌ర్ కార‌కాల‌ను నాశ‌నం చేస్తాయి.

మూత్ర‌పిండాలు, మూత్రాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు ఉన్న వారు నిత్యం ఆకాక‌ర కాయ‌ల‌ను తింటుంటే ఈ స‌మ‌స్య‌ల నుంచి బయట పడవచ్చు. ఇవి తినడం వల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌ల‌ను నివారించవచ్చు.ఆకాక‌ర కాయ‌ల్లో ఫొలేట్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది చిన్న పిల్ల‌ల‌కు, గ‌ర్భిణీ స్త్రీలకు ఎంత‌గానో అవ‌స‌ర‌మైన ముఖ్య‌మైన పోష‌కం. గ‌ర్భ‌స్థ శిశువు ఎదుగుదలకు సహాయపడుతుంది.ఆకాక‌ర కాయ‌ల్లో ఉండే ఫ్లేవ‌నాయిడ్లు యాంటీ ఏజింగ్ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. అందుచేత వృద్ధాప్య ఛాయ‌లు అంత త్వ‌ర‌గా ద‌రి చేర‌వు.

Read more RELATED
Recommended to you

Latest news