కార్న్ దోశ తిన్నారా ఎప్పుడైనా? ఈసారి ట్రై చేయండి.. ఎలా తయారు చేయాలంటే?

-

సాధారణంగా ఎగ్ దోశ, మసాలా దోశ, ఆనియన్ దోశ, ప్లేన్ దోశ.. అంటూ ఎన్నో రకాల దోశలను మనం చూసి ఉంటాం. కానీ.. కార్న్ దోశను మీరు తిన్నారా ఎప్పుడైనా? అవును.. కార్న్ దోశ అంటే మొక్కజొన్న దోశ. సూపర్ గా ఉంటుంది. దాన్ని తయారు చేయడం కూడా సులభమే.

టిఫిన్లలో రారాజు ఎవరంటే దోశ అని చెప్పుకోవచ్చు. అవును…దోశలో వంద రకాల వెరైటీలు ఉంటాయి. వాటిలో ఏ దోశ తిన్నా కూడా అద్భుతంగా ఉంటుంది. అందుకే.. చాలామంది టిఫిన్లలో దోశను తినడానికే ఇష్టపడుతుంటారు.

సాధారణంగా ఎగ్ దోశ, మసాలా దోశ, ఆనియన్ దోశ, ప్లేన్ దోశ.. అంటూ ఎన్నో రకాల దోశలను మనం చూసి ఉంటాం. కానీ.. కార్న్ దోశను మీరు తిన్నారా ఎప్పుడైనా? అవును.. కార్న్ దోశ అంటే మొక్కజొన్న దోశ. సూపర్ గా ఉంటుంది. దాన్ని తయారు చేయడం కూడా సులభమే.

ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే కార్న్ దోశను ఎలా తయారు చేయాలో తెలుసుకొని ఈసారి మీ ఫ్యామిలీకి కార్న్ దోశ రుచి చూపించండి.

కావాల్సిన పదార్థాలు

కార్న్ దోశ చేయడానికి రెండు కప్పుల మొక్కజొన్నలు, అరకప్పు మినపపప్పు, ఓ మూడు నాలుగు ఎండు మిర్చి, జీలకర్ర కొంచెం, కరివేపాకు ఒక కట్ట, ఉల్లిపాయ ఒకటి, ఉప్పు, నూనె ఉంటే చాలు.. వేడి వేడి కార్న్ దోశ తయారు చేయొచ్చు.

తయారు చేయు విధానం

ముందుగా మొక్కజొన్నలను ఒక గిన్నెలో నానబెట్టాలి. మినపపప్పును ఓ గంట ముందుగా నానబెట్టాలి. తర్వాత నీటిని తీసేసి.. మొక్కజొన్నలను గ్రైండ్ చేయాలి. మెత్తగా రుబ్బాలి.

కొన్ని నీళ్లు కూడా పోసుకోవచ్చు. ఆ మిశ్రమంలో జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఉప్పు వేసి బాగా కలిపి మరోసారి గ్రైండ్ చేయండి.

ఇక.. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత కొన్ని ఉల్లిపాయలు, ముందుగా నానబెట్టిన మినపప్పును కలిపి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పనులన్నీ రాత్రే చేసుకోవాలి. ఉదయం టిఫిన్ కోసం కార్న్ దోశ చేయాలనుకునేవాళ్లు.. రాత్రి పూటే దాన్ని మిశ్రమాలు చేసి పెట్టుకోవాలి. ఉదయం కల్లా పిండి బాగా పులుస్తుంది కాబట్టి దోశలు బాగా వస్తాయి. అందుకే రాత్రే చేసుకోవడం బెటర్. రెండు మిశ్రమాలను కలిపి ఒకే మిశ్రమం చేసి పక్కన పెట్టుకోండి.

ఉదయం లేవగానే దోశ పాన్ పెట్టుకొని మామూలు దోశలు వేసినట్టుగా వేసుకొని.. చట్నీ, సాంబారులో తినేయడమే.

Read more RELATED
Recommended to you

Latest news