పెరుగు, మినప పప్పు, పెసరప్పు, పచ్చి మిర్చి, ఇంగువ, కారం, చింతపండు, గరం మసాల, జీలకర్ర, నెయ్యి, నూనె, ఉప్పు.. ఉంటే చాలు.. దహీ వడను వండేయొచ్చు..
దహీ వడ.. అబ్బ పేరు చెప్పగానే నోరూరిపోతుందా? అవును.. దహీ వడను చూశాక నోరు ఊరకుండా ఉంటుందా? అసలే ఎండాకాలం. చల్లచల్లగా దహీ వడను నోట్లో వేసుకుంటుంది.. ఆ మాజాయే వేరప్పా. మరి.. హాట్ హాట్ సమ్మర్ లో కూల్ కూల్ గా దహీ వడను తినేయాలనుందా? అయితే.. దహీవడ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం పదండి..
మీ ఇంట్లోనే దహివడను తయారు చేసుకొని తినేయొచ్చు. దాని కోసం పెరుగు, మినప పప్పు, పెసరప్పు, పచ్చి మిర్చి, ఇంగువ, కారం, చింతపండు, గరం మసాల, జీలకర్ర, నెయ్యి, నూనె, ఉప్పు.. ఉంటే చాలు.
ఎలా తయారు చేయాలంటే?
ముందురోజు రాత్రే మినప పప్పు, పెసరపప్పును నానబెట్టండి. చింతపండును కూడా నానబెట్టండి. ఉదయం లేవగానే నానబెట్టిన మినపపప్పు, పెసరపప్పును తీసుకొని.. వాటిలో సన్నగా తరిగిన పచ్చి మిర్చి, కొంచెం ఇంగువ, కొంచెం ఉప్పు వేసి మిక్సి పట్టండి. మరోవైపు మూకుడు తీసుకొని దానిలో నూనె పోసి వేడి చేయండి.
అప్పటి వరకు గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వడల్లా చేయండి. నూనె కాగాక ఆ వడలను నూనెలో వేసి వేయించండి. అవి గోధుమ రంగు వచ్చే వరకు వేయించండి. ముందు రోజు రాత్రి నానబెట్టిన చింతపండును చేతులతో పిసికి గుజ్జులా చేయండి. పెరుగు తీసుకొని.. దాంట్లో కొన్న నీళ్లు పోసి కాసేపు చిలకండి. ఆ మిశ్రమంలో కాసింత గరం మసాలా, ఉప్పు, కారం వేసి బాగా కలపండి. తర్వాత ఆ మిశ్రమాన్న ముందే చేసి పెట్టుకున్న వడలపై పోయండి. తర్వాత చింత పండు గుజ్జును కూడా వడలపై పోయండి. తర్వాత ఓ పాన్ తీసుకొని కొంచెం నెయ్యి వేసి వేడెక్కాక.. జీలకర్ర, ఇంగువ వేయండి. దాన్ని కూడా వడలపై పోయండి. అంతే.. దహీ వడ రెడీ అయినట్టే. లొట్టలేసుకుంటూ తినడమే ఇక తరువాయి..