పొద్దున్న పూట ఖాళీ కడుపుతో తీసుకునే ఆహారాన్ని బట్టి మీ ఆరోగ్యం డిసైడ్ అవుతుందని మీకు తెలుసా.? అవును.. ఖాళీ కడుపుతో కొన్ని ఆహారాలను తీసుకోకూడదు. ఎందుకంటే కొన్ని ఆహారాలు ఎసిడిటీని కలిగిస్తాయి. ఆ కారణంగా గుండె మంట, అన్నం సరిగ్గా జీర్ణం కాకపోవడం, కడుపు ఉబ్బిపోయినట్లుగా అనిపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
ప్రస్తుతం ఇలాంటి సమస్యలకు కారణమయ్యే ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.
టమాట:
టమాట సాధారణంగా ఎసిడిక్ లక్షణం కలిగి ఉంటుంది. ఖాళీ కడుపుతో టమాటాను తినడం వల్ల కడుపులోని యాసిడ్స్ స్థాయిల్లో సమతుల్యత లోపిస్తుంది. ముఖ్యంగా సెన్సిటివ్ స్టమక్ ఉన్నవారు దీన్ని అస్సలు ముట్టుకోకూడదు.
కారం కలిగిన ఆహారాలు:
కారం, నల్ల మిరియాలు, ఇంకా హాట్ సాస్ మొదలైన వాటిని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల కడుపులో ఈ యాసిడ్స్ పెరుగుతాయి. ఈ కారణంగా కడుపులో మంటగా అనిపిస్తుంది.
కార్బోనేటెడ్ పానీయాలు:
మార్కెట్లో విరివిగా దొరికే కార్బోనేటెడ్ డ్రింక్స్ అస్సలు ముట్టుకోకూడదు. దీనివల్ల కడుపు ఉబ్బిపోయినట్లుగా అనిపిస్తుంది. కాబట్టి పొద్దున్న లేవగానే ఖాళీ కడుపుతో కార్బోనేటెడ్ పానీయాలు తాగకూడదు.
కాఫీ:
కడుపులోని యాసిడ్ ఉత్పత్తిని కాఫీ పెంచుతుంది. దానివల్ల ఎసిడిటీ కలుగుతుంది. అంతేకాదు చాతిలో మంటగా అనిపించడం, ఆహారం జీర్ణం కాకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
సిట్రస్ ఫ్రూట్స్:
సిట్రస్ ఫలాలైన నారింజ, నిమ్మకాయ, ఉసిరి మొదలగు వాటిని తినడం వల్ల కడుపులో అవస్థ పెరుగుతుంది.
అంతేకాదు చాక్లెట్, ఫ్రై చేసిన ఆహారాలు, వెల్లుల్లి, ఉల్లిగడ్డ ఇంకా వండని కూరగాయలు, ఆల్కహాల్ వంటి వాటిని ఖాళీ కడుపుతో తీసుకోకూడదు.