“కొబ్బరి రవ్వలడ్డు” తయారీ విధానం

-

కావలసినవి :
బొంబాయి రవ్వ : 2 కప్పులు
ఎండుకొబ్బరి పొడి : 1 కప్పు
యాలకులపొడి : అర టేబుల్‌ స్పూన్‌
పాలు : అర కప్పు
నెయ్యి : 3 స్పూన్లు
చక్కెర : ఒకటిన్నర కప్పు
జీడిపప్పు : పావు కప్పు
ఎండుద్రాక్ష : పావు కప్పు

తయారీ :
బొంబాయి రవ్వను పాన్‌లో వేసి స్పూన్‌ నెయ్యిని చేర్చి దోరగా వేయించాలి. అందులోనే ఎండు కొబ్బరి పొడి కూడా వేసి 5 నిమిషాలపాటు వేయించాలి. రవ్వ మిశ్రమంలో చక్కెర, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత నెయ్యిలో జీడిపప్పు, ఎండుద్రాక్ష వేయించి రవ్వలో కలుపాలి. రవ్వ కొంచెం చల్లారాక అందులో మరిగించిన పాలు పోసి ఉండలు చేసుకుంటే సరిపోతుంది. ఈ కొబ్బరి రవ్వలడ్డును దేవునికి సమర్పించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version