అరటి పండ్లు సంవత్సరం మొత్తం మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. అరటిపండు ఇష్టం ఉండని వారు ఎవ్వరూ ఉండరు. ఐరన్, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా కలిగిన అరటి పండ్లు అన్ని వయసుల వారు తినవచ్చు.
అయితే తరచుగా మార్కెట్లో అరటి పండ్లు కొనేవారు కొన్ని రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు. ముఖ్యంగా పండ్లు తొందరగా పాడైపోవడం, వాటి మీద నల్ల మచ్చలు ఏర్పడటం జరుగుతుంటుంది. ఈ కారణంగా అరటి పండ్లను ఎక్కువ రోజులు నిల్వ ఉంచలేకపోతారు.
ప్రస్తుతం నల్లటి మచ్చలు రాకుండా అరటి పండ్లను తాజాగా ఎలా ఉంచుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
అరటి పనులను వేలాడదీయండి
మార్కెట్లో నుంచి అరటి పండ్లు కొనుక్కొని వచ్చాక వాటిని టేబుల్ మీదా, ఫ్రిజ్ మీదా పెట్టకండి. అరటిపండ్ల ఉపరితలం దేనికి తగలకుండా వాటిని గాలిలో వేలాడదీయాలి. ఇలా చేస్తే అరటి పండ్లు తాజాగా ఉంటాయి.
ఫ్రిడ్జ్ లో అస్సలు పెట్టకూడదు
ఫ్రిజ్లో పెట్టడం వల్ల ఎక్కువ రోజులు పాడవకుండా అరటి పండ్లు ఉంటాయని అనుకుంటే మీ పొరపాటు అవుతుంది. చల్లని ఉష్ణోగ్రతల వద్ద అరటి పండ్లు తొందరగా పాడవుతాయి. అందుకే వాటిని పొడి వాతావరణంలో ఉంచాలి
ఇతర పండ్లతో అరటి పండ్లను పెట్టకూడదు
ఆపిల్, టమాటా వంటి పండ్లతో అరటి పండ్లను ఉంచడం వల్ల అవి మగ్గినప్పుడు దాని నుండి వెలువడే వాయువులు అరటి పండ్లు తొందరగా మగ్గేలా చేస్తాయి. ఈ కారణంగా వాటి మీద నల్లటి మచ్చలు ఏర్పడతాయి. అరటి పండ్లను ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలంటే వాటిని సపరేట్గా స్టోర్ చేయాలి.
అల్యూమినియం పేపర్ ని వాడండి
అరటి పండ్లను గుత్తి నుండి వేరు చేసి ఒక్కొక్క దాని కాడలకు అల్యూమినియం పేపర్ ని చుట్టండి. కేవలం కాడలకు మాత్రమే చుట్టాలి పండుకి చుట్ట కూడదు. ఇలా చేయడం వల్ల అరటి పండ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.