చలికాలంలో ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవాల్సిన ఆహారాలు..

-

ప్రతీసారీ ఒక ఋతువులో నుండి మరో ఋతువు లోకి మారిపోగానే మనలో కూడా మార్పులు వస్తుంటాయి. వాతావరణ మార్పులు భూమి మీద ఉన్న అన్ని జీవరాశుల్లో మార్పులు తీసుకొస్తాయి. ప్రస్తుతం చలికాలం వచ్చేసింది. దీంతో ఒక్కసారిగా జలుబు, దగ్గు బారినపడుతున్నారు. అందుకే చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు తీసుకోవాలి.

చలికాలంలో ఏయే ఆహారపదార్థాలు తీసుకుంటే బాగుంటుందో ఒక్కసారి తెలుసుకోండి.

స్వీట్ పొటాటో:

స్వీట్ పొటాటోలో అధికమొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్ ఏ, పొటాషియం శరీరానికి బాగా ఉపయోగపడతాయి. చక్కెరశాతం ఎక్కువగా ఉన్నప్పటికీ పోషకాలు బాగా ఉండడంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఖర్జూరం:

ఖర్జూరంలో కొవ్వు తక్కువగా ఉంటుంది. దీనివల్ల శరీరం బరువు పెరగకుండా కావాల్సిన శక్తిని అందిస్తుంది. అలాగే చలికాలంలో వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో వేడి బాగా పెరుగుతుంది.

పసుపు:

పసుపు తీసుకోవడం ద్వారా నొప్పులు తగ్గిపోతాయి. చలికాలంలో అంటువ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆహారంలో పసుపు భాగం చేసుకోవడం వల్ల అంటువ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

చికెన్, గుడ్లు..

ఈ రెండూ జీర్ణం కావడానికి చాలా టైమ్ పడుతుంది. దానివల్ల శరీరంలో వేడి ఉత్పన్నం అవుతుంది. వీటిలో ఉండే కాల్షియం, ప్రోటీన్ శరీరానికి చాలా అవసరం.

రాగులు:

రాగుల్లో ఉండే అధికశాతం కాల్షియం శరీరానికి చాలా అవసరం. ఎముకలు దృఢంగా తయారవడానికి రాగులు తీసుకోవాలి.

బాదం..

ప్రతీ రోజూ ఎంతో కొంత బాదంపప్పు తినడం మంచిది. దీనివల్ల నాడీవ్యవస్థ ఆక్టివ్ గా పనిచేస్తుంది. శరీరానికి, గుండెకి మంచి రక్షణ ఇస్తుంది.

రెడ్ క్యాప్సికం:

రెడ్ క్యాప్సికంలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ కరోనా టైమ్ లో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు.

సో.. మరెందుకు ఆలస్యం. మీ ఆహారంలో వీటిని భాగం చేసుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version