హోలీ స్పెషల్: కోకోనట్ పాన్ లడ్డు ఇలా సులువుగా చేసేయండి…!

Join Our Community
follow manalokam on social media

ఇప్పటికే చాలా మంది ఇళ్లల్లో హోలీ పండుగ ప్రిపరేషన్స్ మొదలై పోయి ఉంటాయి. హోలీ అంటే రంగుల పండగ. అలానే ఆ రోజు ఇంట్లో స్పెషల్ స్వీట్స్ తయారు చేసుకుంటూ ఉంటారు. ఇంటిల్లపాది సరదాగా కలిసి భోజనం చేస్తారు. అయితే ఈసారి హోలీ సందర్భంగా కొబ్బరి పాన్ లడ్డు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..! ఈ రెసిపీ తో పండుగ మరింత ఆనందంగా ఉంటుంది. మరి ఈ స్పెషల్ రెసిపీ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఇప్పుడే చూసేద్దాం.

హోలీ స్పెషల్ కోకోనట్ పాన్ లడ్డు కి కావాల్సిన పదార్థాలు:

కొబ్బరి పొడి ఒక కప్పు
తమలపాకులు
కండెన్స్డ్ మిల్క్ అర కప్పు
1 స్పూన్ యాలుకల పొడి
ఒక స్పూన్ నువ్వులు
2 టేబుల్ స్కూల్ గుల్కన్డ్
ఒక టేబుల్ స్పూన్ స్వచ్ఛమైన నెయ్యి

హోలీ స్పెషల్ కోకోనట్ పాన్ లడ్డు తయారు చేసుకునే విధానం:

ముందుగా తమలపాకులని శుభ్రం చేసుకుని. వాటిని కట్ చేసుకోండి. ఇప్పుడు తమలపాకులని పాలల్లో వేసి మెత్తగా రుబ్బండి.

ఇప్పుడు ఒక నాన్స్టిక్ పాన్ తీసుకుని దానిలో కొద్దిగా నెయ్యి వేయండి. కొబ్బరి పొడిని దానిలో వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించండి. దీనిని పక్కన ఉంచండి.

బ్లెండ్ చేసుకున్న పేస్ట్ని తీసుకుని యాలుకల పొడి దానిలో వేయండి. వీటిని కొబ్బరి పొడి వున్న పాన్ లో వేసి దగ్గరపడే వరకు ఉంచండి. ఇది చల్లారిపోయిన తర్వాత లడ్డు మాదిరి చేయండి.

నచ్చితే గుల్కన్ నువ్వుల పప్పు కూడా వేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్. ఇలా ఉండలు చేసుకుని ఎయిర్ టైట్ కంటైనర్ జార్ లో ఉంచితే రెండు నుంచి మూడు రోజుల పాటు నిల్వ ఉంటాయి.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...