బీట్ రూట్ లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఇది ఆరోగ్యవంతమైన ఆహారం. దీనిని తరచుగా తినడం వల్ల రక్తం శుద్ది అవుతుంది.శరీరానికి శక్తిని ఇస్తుంది. అయితే వాటిని ఉపయోగించటానికి ముందు బాగా కడగాలి. అయితే బీట్ రూట్ కూరని అందరు ఇష్టపడరు. అందుకే అలాంటివారి కోసం వెరైటీగా బీట్ రూట్ సమోసా తయారి చూద్దాం.
తయారికి కావలసిన పదార్థాలు: బీట్ రూట్ 1 కప్పు ఉడికించి పెట్టాలి. బంగాళదుంపలు 2 ఉడికించి పొట్టు తీయాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు ½ కప్పు, పచ్చి మిర్చి 4, కొత్తిమీర 1 కప్పు, మైదా 3 కప్పులు, నెయ్యి 3 స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, కారం 1 స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా.
తయారి విధానం: మైదా లో వేడివేడి నెయ్యి వేసి, ఉప్పు కలిపి నీరు పోస్తూ పూరీ పిండిలా కలిపి ఉంచాలి. ఉడికించిన దుంపలను చిన్న ముక్కలుగా కట్ చేయాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నాలుగు స్పూన్ల నూనె వేసి ఉల్లి, పచ్చి మిర్చి ముక్కలు వేసి వేయించాలి. తరువాత దుంపలను వేసి ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. కూర దగ్గరగా అవుతున్నప్పుడు కొత్తిమీర కలిపి దించాలి. మైదా మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండని పూరీలాగా ఒత్తుకుని మధ్యకు కట్ చేయాలి. ఒక్కో ముక్కను కోన్ ఆకారంలో చుట్టి అందులో బీట్ రూట్ కూరను పెట్టి అంచులను తడి చేతితో నొక్కాలి. అలా చేసుకున్న వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే బీట్ రూట్ సమోసాలు రెడీ.
పోషక విలువలు: ప్రోటీన్లు 1.7 గ్రా, కార్బో హైడ్రేట్లు 7 గ్రా, కొవ్వు 0.1 గ్రా, పైబర్ 0.2 గ్రా, కేలరీస్ 306.1, కాల్షియం 200 మి.గ్రా, పొటాషియం 300 మి గ్రా