బ్రేకింగ్; ఏపీలో నలుగురు వైద్యులకు కరోనా…!

-

అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపుతుంది. నలుగురు వైద్య సిబ్బందికి కరోనా వైరస్ రావడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి టీబీ వార్డులో వైద్యులు చికిత్స చేసారు. అతనికి నలుగురు వైద్యులు చికిత్స చేయగా… నలుగురికి అధికారులు పరిక్షలు నిర్వహించగా ఆ నలుగురికి పాజిటివ్ వచ్చింది. దీనితో జిల్లాలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగించింది.

దీనితో జిల్లాలో ఆరు నుంచి 13 కి చేరుకున్నాయి కరోనా కేసులు. దీనితో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీసినట్టు తెలుస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను అడిగి సమాచారం సేకరించారు. అయితే ఇక్కడ వైద్యులు కరోనా వైరస్ ని తక్కువ అంచనా వేసారని అందుకే… కరోనా కేసులు పెరుగుతున్నాయని జాగ్రత్తగా ఉండాలని అధికారులు వైద్యులకు సూచిస్తున్నారు.

ప్రస్తుతం ఏపీలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో 330 కి కరోనా కేసులు చేరుకున్నాయి. నలుగురు వ్యక్తులు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కి వైద్యం చేసే డాక్టర్లకు భద్రత లేదు అనే ఆరోపణలు వస్తున్న తరుణంలో ఇలాంటివి చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. ఏపీలో పరిస్థితులపై కేంద్రం ఆరా తీస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news