పెరుగు తినడం ఇష్టంలేదా? అయితే ఇలా తినండి!

పచ్చడి, కూర, పెరుగు ఈ పద్ధతిలో భోజనం చేస్తుంటారు భారతీయులు. పెరుగుతో తినకండా కంచం ముందునుంచి లేవరు కొంతమంది. కూరతో కడుపునింపుకొని పెరుగులేకుండా భోజనం ముగిస్తారు మరికొంతమంది. వట్టి పెరుగుకు ఆమడ దూరంలో ఉన్నవారు పెరుగువడను వారానికి మూడుసార్లు తీసుకోవడం వల్ల్ల శరీరానికి క్యాల్షియం అందుతుంది. దీంతోపాటు సోడియం, పొటాషియం, ప్రోటీన్లు, విటమిన్స్ కూడా శరీరానికి లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెరుగువడ తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం.

కావాల్సినవి :
పెసరపప్పు : 3 కప్పులు
చాట్ మసాలా, జీలకర్రపొడి : టీస్పూన్
ఎండుమిర్చి : 4
కారం : 1 టీస్పూన్
పచ్చిమిర్చి : 3
అల్లంపేస్ట్ : అర టీస్పూన్
జీలకర్ర : 1 టీస్పూన్
ఉప్పు, నూనె : తగినంత.
కొత్తిమీర తరుగు : 1 కప్పు
పెరుగు : 4 కప్పులు
తయారీ :
ముందుగా పెసరపప్పును మూడుగంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత పెసరపప్పు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు అన్ని ఒక జార్‌లో వేసి మిక్సీ పట్టించాలి. కడాయిలో నూనె పోసి వేడి చేయాలి. సెపరపప్పు మిశ్రమాన్ని వడలుగా చేసుకొని నూనెలో వేసి డీఫ్రై చేయాలి. వీటిని ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఈ క్రమంలో పెరుగు, జీలకర్రపొడి, చాట్‌మసాలా, కారం వేసి పోపులా వేసుకోవాలి. దీన్ని వడలపై వేసి కొత్తిమీరతో గార్నిష్‌తో చేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది.