గోబీ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలి అంటే…!

-

చాలా మంది కాబేజీ, కాలి ఫ్లవర్[గోబీ ] వంటి కూరగాయలను దూరం పెడతారు. కాని కాలి ఫ్లవర్ కి మసాలా పట్టించి కూర చేస్తే కాలీఫ్లవర్ ని పక్కన పెట్టిన వారు కూడా ఇష్టంగా తింటారు.

కాలి ఫ్లవర్ మసాలా కర్రీ కి కావలసిన పదార్థాలు: కాలి ఫ్లవర్ పెద్దది 1, నూనె 4 పెద్ద స్పూన్లు, ఉల్లిపాయలు 4, వెల్లుల్లి 6 రెబ్బలు, గసగసాలు ½ స్పూన్, జీడిపప్పు 8, పచ్చి కొబ్బరి తురుము ½ కప్పు, లవంగాలు 2, దాల్చిన చెక్క చిన్న ముక్క, జీలకర్ర ¾ స్పూన్, ఉప్పు,పసుపు సరిపడా. ఉల్లి,వెల్లుల్లిని కలిపి ముద్దగా నూరాలి. మిగిలిన మసాలాలు అన్ని కలిపి ఒక ముద్ద రుబ్బాలి.

తయారీ విధానం: కాలి ఫ్లవర్ ని కట్ చేసి ఉప్పు కలిపినా గోరు వెచ్చని నీటిలో ఒక పావు గంట నాననివ్వాలి. తరువాత నీటిలో నుండి కాలి ఫ్లవర్ ముక్కలను తీసి నూరి ఉంచిన మసాలా ముద్దలో సగం ముక్కలకు పట్టించాలి. స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నూనె పోసి కాగిన తరువాత మిగిలిన మసాలా ముద్ద వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత కాలి ఫ్లవర్ ముక్కలు వేసి కొద్దిగా నీరు పోసి సన్నని మంట మీద మధ్య మధ్యలో గరిటె తో తిప్పుతూ ఉడికించాలి. ఉడికిన తరువాత కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చెయ్యాలి. ఇది రోటి, పుల్కా ల్లోకి బాగుంటుంది.

పోషక విలువలు: కేలరీస్ 81, కొవ్వు 5.44g, కొలెస్ట్రాల్ 0 mg, కార్బోహైడ్రేట్స్ 7.22g,4.8g, సుగర్స్ 2.29g, ప్రోటీన్ 3.14g, సోడియం 548 mg, ఐరన్ 0.65 mg, కాల్షియం 30mg, పోటాషియుం 252mg, విటమిన్ సి 71.2 mg, విటమిన్ ఎ 237iu.

Read more RELATED
Recommended to you

Latest news