ఎవరేమనుకున్నా తన రూటే సపరేటు అని అనిపించుకుంటున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికాని కకావికలం చేస్తున్న కరోనా వైరస్ కట్టడి విషయంలో ఫెయిల్ అయినట్లు అనేక విమర్శలు ట్రంప్ ఎదుర్కొంటున్నారు. మరోపక్క ఇదే సంవత్సరం అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న తరుణంలో ప్రతిపక్షాలు కూడా తీవ్రస్థాయిలో ట్రంప్ అనుసరిస్తున్న తీరుపై ఆరోపణలు చేస్తున్నాయి. ఇటువంటి టైములో ట్రంప్..అసలు ఈ కరోనా వైరస్ అమెరికాలో ఇంతగా విస్తరించడానికి కారణం ప్రపంచ ఆరోగ్య సంస్థ అని వైరస్ తీవ్రస్థాయిలో దేశంలో వచ్చిన నాటి నుండి కామెంట్లు చేస్తూనే ఉన్నారు. అమెరికా దేశం నుండి ఎక్కువ నిధులు తీసుకుంటూ, మరోపక్క ప్రపంచ ఆరోగ్య సంస్థ… చైనా కి అండగా నిలబడుతుంది అంటూ తీవ్ర స్థాయిలో ట్రంప్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పై విమర్శలు చేయడం జరిగింది.ప్రపంచంలో ఇంత దారుణంగా ప్రాణ నష్టం జరగడానికి కారణమైన చైనా ని డబ్ల్యూహెచ్వో మొదట్లో వెనకేసుకు వచ్చింది. ఇప్పుడు కూడా చైనా తప్పొప్పులను ప్రస్తావించడం లేదు అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ పై సీరియస్ అవుతున్నారు. దాదాపు డబ్ల్యూహెచ్వో కి వస్తున్న నిధులలో ఎక్కువ శాతం 15శాతం అమెరికా ఇచ్చి టాప్ లో ఉందని…అటువంటిది కరోనా వైరస్ విషయంలో ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయకుండా డబ్ల్యూహెచ్ వో నిద్రపోయింది అంటూ మండిపడుతున్నారు. ఇక నుండి అమెరికా దేశం నుండి ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఎటువంటి నిధులు ఇవ్వటం లేదని తేల్చిచెప్పేశాడు.
పూర్తిగా నిధులు ఆపేసినట్లు డోనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇదే బాటలో డోనాల్డ్ ట్రంప్ వ్యవహరించిన విధంగానే భారత ప్రధాని మోడీ కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ కట్టడి చేయడంలో ఫెయిల్ అయిందని బలంగా నమ్ముతున్నారట. చైనాలో అంత దారుణంగా ప్రమాదకరంగా వైరస్ ఉన్న టైంలో ప్రపంచాన్ని అలర్ట్ చేయాల్సిన డబ్ల్యూహెచ్ వో పూర్తిగా ఫెయిల్ అయిందని… అలాంటి ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు ఇవ్వడం వేస్ట్ అని నిధులు ఇవ్వటం ఆపేయాలని మోడీ కూడా అనుకుంటున్నట్లు…అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. ట్రంప్ బాటలోనే మరికొన్ని దేశాల అధికారులు కూడా ఇదే నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. ఇంతమంది దేశాలు ఒకేసారి నిధులు ఆపేయడం అంటే కచ్చితంగా ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థకు వెరీ బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు.